ఇక మనం ఇంట్లో లేదా ఆఫీసులో పని చేస్తున్నా, మన ల్యాప్‌టాప్ కీబోర్డ్ చాలా మురికిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. దుమ్ము, వేలి చెమట ఇంకా అలాగే బిస్కెట్ల పొడి లేదా మీ తలపై వెంట్రుకలు అనేవి ఉంటాయి.అయితే చాలా మంది కూడా ల్యాప్‌టాప్‌ కీబోర్డులను మాత్రం శుభ్రం చేయరు. ఇక ల్యాప్‌టాప్‌ కీబోర్డును ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటేనే బాగుంటుంది. లేకపోతే కీబోర్డులో సమస్య తలెత్తే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దుమ్ము ఇంకా అలాగే ధూళి చేరడం వల్ల కీబోర్డు త్వరగా పాడయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. చిన్న కీలు లేదా గాడ్జెట్‌లు పాడవకుండా ల్యాప్‌టాప్ కీబోర్డ్‌ను ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక కీబోర్డ్‌పై ఏదైనా అదనపు ప్రెజర్ ఉంటే, అది పాడయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అందుకే మీరు ఏ మెటీరియల్‌లను సురక్షితంగా ఉపయోగించాలో ఇప్పుడు ఖచ్చితంగా కూడా తెలుసుకోవాలి.మైక్రోఫైబర్ క్లాత్, సాఫ్ట్ పెయింట్ బ్రష్ -కాటన్, స్వాబ్, కంప్రెస్డ్ ఎయిర్,  కీబోర్డ్ క్లీనర్ ఇవి క్లీన్ చెయ్యడానికి ఖచ్చితంగా ఉండాలి.


ఇక ల్యాప్‌టాప్‌ను ఎలా శుభ్రం చేయాలి అంటే..ముందుగా మీ ల్యాప్‌టాప్ నుంచి అడాప్టర్‌ని తీసి, దాన్ని ఇక షట్ డౌన్ చేయండి. ఇలా చేసి తుడవడం వల్ల ఎటువంటి విద్యుత్ సమస్య అనేది మీకు ఉండదు.ఇక మీరు మీరు మూసి ఉన్న ల్యాప్‌టాప్‌ను బాగా పట్టుకుని, తలకిందులుగా చేసి దానిని శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల దుమ్ము, ఆహార ముక్కలు, వెంట్రుకలు ఇంకా అలాగే ఇతరాలు నేలపై పడి కీబోర్డ్‌ను శుభ్రం చేయడం చాలా సులభం అవుతుంది.ఇక ఇప్పుడు ల్యాప్‌టాప్‌ను మైక్రోఫైబర్ క్లాత్ ఇంకా సాఫ్ట్ పెయింట్ బ్రష్ లేదా ఏదైనా కంప్రెస్డ్ ఎయిర్ గాడ్జెట్ సహాయంతో బాగా శుభ్రం చేయండి. అయితే ఇలా చేస్తున్నప్పుడు ఎక్కువ బలం మాత్రం ఉపయోగించకండి.తేలియపాటిగా చేతులతో బాగా శుభ్రం చేయండి.ఇక లిక్విడ్ కీబోర్డ్ క్లీనర్లు కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే కీబోర్డ్‌లో మాత్రం దీన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. క్లీనర్‌ను నేరుగా కీబోర్డ్‌పై ఎప్పుడూ అస్సలు స్ప్రే చేయవద్దు. ఇంకా దీని కోసం ఒక మృదువైన గుడ్డను తీసుకుని దానిపై క్లీనర్ను కొద్దిగా అప్లై చేసి, ఇక ఆపై మెత్తటి గుడ్డ సహాయంతో బాగా శుభ్రం చేయండి. లిక్విడ్‌ను నేరుగా అప్లై చేస్తే ల్యాప్‌టాప్ సర్క్యూట్ అనేది దెబ్బతింటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: