ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ వైరల్ న్యూస్ చదవండి..ఎలాంటి ట్రాఫిక్ జామ్ సమస్య లేకుండా ఆకాశంలో కార్లతో ఎగిరిపోతే ఎలా ఉంటుంది?ఆ ఫీలింగ్ చాలా హాయిగా ఉండదు. ఎంత హాయి అంటే మాటల్లో చెప్పలేనంత హాయిగా ఉంటుంది. అయితే, త్వరలోనే ఆ కల నేరవేరనుంది. ఇప్పటికే పలు సంస్థలు  ఎయిర్ ట్యాక్సీల తయారీలో బిజీగా ఉన్నాయి. కొన్ని ప్రయోగాత్మకంగా విజయవంతమయ్యాయి కూడా. ఇవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే విషయం మీద ఇంకా స్పష్టత రాలేదు. అయితే, యూకే ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉంది. ప్రపంచంలోనే తొలి అర్బన్ ఎయిర్ పోర్టును ఈ ఏడాది అందుబాటులోకి తెచ్చేందుకు ఆ దేశం సిద్ధమవుతుంది.కేవలం ఎయిర్ ట్యాక్సీల కోసమే ఈ అర్బన్ ఎయిర్‌పోర్ట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం యూకే ప్రభుత్వం 1.2 మిలియన్ పౌండ్లు అంటే ఇండియా కరెన్సీలో  రూ.87,488,700 కేటాయించింది. ఆ ప్రాజెక్ట్ బాధ్యతలను హ్యుందాయ్ సంస్థకు అప్పగించారు.

 ఈ ఏడాది నవంబరులో కోవెంట్రీ‌లోని యూకే సీటీ ఆఫ్ కల్చర్‌లో దీనిని ప్రారంభించాబోతున్నారు.ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా సమయం పడుతుంది. ముందుగా దీన్ని ఎయిర్ ట్యాక్సీల మీద అవగాహన కల్పించే కేంద్రంగా సేవలు అందించనుంది. టెక్నికల్‌గా ఈ ఎయిర్ ట్యాక్సీలను ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ ల్యాండింగ్ వాహనాలని పిలుస్తారు. ఇవి విమానాల తరహాలో టేకాఫ్ కావు. హెలికాప్టర్లు లేదా డ్రోన్ల తరహాలో నిట్ట నిలువుగా పైకి ఎగురుతాయి. భవిష్యత్తులో ఈ కార్లలో ప్రయాణికులను, వస్తువులను రవాణా చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

ఈ సందర్భంగా అర్భన్ ఎయిర్ పోర్ట్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ రిసాంధు మాట్లాడుతూ.. ‘‘కార్లకు రోడ్లు కావాలి. రైళ్లకు పట్లాలు కావాలి. విమానాలకు ఎయిర్‌పోర్టులు కావాలి. అలాగే EVTOLకు అర్బన్ ఎయిర్ పోర్టులు కావాలి. వీటి ద్వారా దేశంలోని అన్ని నగరాలను అనుసంధానం చేస్తాం. కేవలం భూమి మీదే కాకుండా నీటిలో తేలియాడే డాక్స్ కూడా ఏర్పాటు చేసి ఎయిర్ ట్యాక్సీలకు ఛార్జింగ్ సదుపాయాలను కల్పిస్తాం’’ అని చెప్పారు. ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: