చైనా నుండి ప్రపంచ దేశాలకు ఎగబాకిన కరోనా వైరస్.. ప్రపంచాన్ని గడగడలాడించింది. అలా తగ్గినట్టే తగ్గి ఇప్పుడు సెకండ్ వేవ్ తో తన విజృంభణను మొదలు పెట్టింది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది కానీ దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ కొందరు కరోనా బారిన పడ్డారని... మరికొందరు అనారోగ్య పాలయ్యారని పలు కథనాలు వింటూనే ఉన్నాం. ప్రజలు ఏ వార్త నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి సందర్భంలో నేను వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికి కరోనా బారిన పడ్డాను అంటూ తెలిపారు ప్రముఖ హీరోయిన్.

ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుత కాంగ్రెస్ లీడర్ నగ్మా... కరోనా రాకుండా ముందు జాగ్రత్త కోసం, ఏప్రిల్ 2వ తేదీన ముంబైలో ఆమె కరోనా ఫస్ట్ డోస్ తీసుకున్నారు. అయితే కొద్ది రోజుల తరువాత కాస్త అనారోగ్యంగా అనిపించడంతో  కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఊహించని విధంగా ఆ రిపోర్ట్ లో నగ్మాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ కరోనా పాజిటివ్ అని రావడంతో ఆమె మరియు వారి కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ వార్త విన్న వారు కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఉపయోగం లేదన్న మాటను జీర్ణించుకోలేక పోతున్నారు.

ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంటూ వైద్యుల సలహాలు పాటిస్తున్నారు.  కరోనా వ్యాక్సిన్ వైరస్ పై ఏమాత్రం ప్రభావం చూపట్లేదు అన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో ఆరోగ్య నిపుణులు, అభివృద్ధి చేసిన సంస్థలు ఏం వివరణ ఇస్తారో చూడాలి. వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ మన జాగ్రత్తలో మనము ఉండాలని పలువు సూచనలు ఇస్తున్నారు. కరోనా వైరస్ ఇప్పుడల్లా వదిలి వెళ్లేలా కనిపించడం లేదు. కాబట్టి మాస్కును మరియు శానిటైజర్ ను సక్రమంగా ఉపయోగిస్తూ జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: