సముద్రంలో షిప్ ఆక్సిడెంట్ జరిగితే ఇంకేముంది అంతే. దెబ్బకు ప్రాణాల మీద ఆశ వదులుకోవడమే. ఇప్పటిదాకా ఎన్నో ఆక్సిడెంట్స్ జరిగాయి అలా.టైటానిక్ సినిమా అందరికి గుర్తు వుండే ఉంటుంది. అందులో షిప్ మునిగిపోయి హీరోయిన్ మినహా హీరోతో సహా అందరూ చనిపోతారు.ఈ ప్రపంచంలో అందరికి తెలిసిన షిప్ ఆక్సిడెంట్ టైటానిక్ సినిమా ఇన్సిడెంటే..ఇప్పటికి ఆ సినిమా ఆక్సిడెంట్ చాలా మందిని బయపెడుతూ ఉంటుంది. టైటానిక్ సినిమా తరహాలోనే అదే తరహాలో ఇక్కడ కూడా పెద్ద ఆక్సిడెంట్ జరిగింది. వివరాల్లోకి వెళితే..ఇండోనేసియాలో ప్రయాణికులతో వెళ్తున్న భారీ షిప్పు మొలుక్కా సముద్రంలో మంటల్లో చిక్కుకుంది. దీంతో ప్రయాణికులు తమ ప్రాణాలను రక్షించుకొనేందుకు ముద్రంలోకి దూకారు. నార్త్ మలూకాలోని టెర్నేట్ ప్రావిన్స్ నుంచి ఈశాన్య ఇండోనేషియాలోని మారుమూల ద్వీపమైన సననకు వెళ్తున్న కేఎం కార్య ఇందా అనే ఈ నౌకలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో నౌకలో 22 మంది పిల్లలు, 14 మంది సిబ్బందితో సహా 181 మంది ఉన్నారు. ప్రమాదం చోటుచేసుకోగానే ప్రయాణికులు లైఫ్ జాకెట్లు ధరించి సముద్రంలోకి దూకారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి గల్లంతైనట్లు అధికారులు తెలిపడం జరిగింది.


ఈ షిప్ కెప్టెన్ ఫైర్ ఆక్సిడెంట్ వెంటనే గుర్తించి అధికారులకు తెలియజేయడంతో వెంటనే సహాయం అందింది. లేకపోతే ప్రయాణికులంతా మంటలకు ఆహుతయ్యేవారు. పైగా ఈ ప్రమాదం తిమింగలాలు ఎక్కువగా సంచరించే సముద్ర జలాల్లో చోటుచేసుకుంది. ప్రజలు సముద్రంలో దూకే సమయానికి తిమింగలాలేవీ అక్కడ లేకపోవడం అదృష్టమనే చెప్పుకోవాలి. ఉదయం 7 గంటల సమయంలో టెర్నేట్ నగరం నుంచి ప్రయాణాన్ని మొదలు పెట్టిన 15 నిమిషాలకే ఓడలోని ఇంజిన్‌ గదిలో మంటలు వ్యాపించాయని తెలిపారు. అయితే, ప్రమాదానికి గల కారణాలేవీ పూర్తిగా తెలియరాలేదని, ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు వెల్లడించడం జరిగింది.ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.


https://youtu.be/Xi_huu8_mKc

మరింత సమాచారం తెలుసుకోండి: