అట్లాంటిక్ మహాసముద్రంలోని బెర్ముడా ట్రయాంగిల్ గురించి ఎన్నో ఏళ్లుగా మ‌నం క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకుంటూనే ఉన్నాం. దీనినే  డెవిల్స్ ట్రయాంగిల్ , ప్ర‌పంచ మృత్యు గృహ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప్రాంతానికి వెళ్లిన ఎన్నో నౌక‌లు, విమానాలు , ఓడ‌లు, ప‌డ‌వులు కూడా గ‌ల్లంతు అయిపోయాయి. అస‌లు దీని మిస్టరీ ఏంటనేది ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పలేదు స‌రిక‌దా ?  దీనిపై ఎన్నో ప‌రిశోధ‌న‌లు జ‌రిగినా ఇప్ప‌ట‌కీ స‌రైన క్లారిటీ అయితే ఎవ్వ‌రికి లేదు. ఈ ప్రాంతానికి వెళ్లిన ఎంతో మంది మ‌నుష్యులు కూడా మాయ‌మై పోయారు.

అయితే ఇలాంటి భ‌యంక‌ర‌మైన ప్రాంతం మ‌న దేశంలో కూడా ఉంది. ఇది కూడా ఓ పెద్ద మిస్ట‌రీయే.. ! అది ఎక్క‌డో కాదు ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ - టిబెట్ మధ్యలో ఉన్న షాంగ్రి - లా వ్యాలీ ప్రాంతం. దీని గురించి హిస్ట‌రీలో చాలా క‌థలే ఉన్నాయి. ఇక్క‌డ స‌మ‌యం ఆగిపోతుంద‌ని.. ముందుకు క‌ద‌ల‌ద‌ని... ఇక్క‌డ ఉంటే ఎవ్వ‌రికి కూడా వ‌య‌స్సు పెరగ‌ద‌ని అంటారు. ఇక్క‌డ‌కు చేరుకునేందుకు, దీని గురించి తెలుసుకు నేందుకు చాలా మంది ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసినా ఎవ్వ‌రూ స‌క్సెస్ కాలేక‌పోయారు.

కొండ‌ల మ‌ధ్య లోయ‌గా ఈ ప్రాంతం ఉంద‌ట‌. ప్ర‌ఖ్యాత తంత్ర ర‌చ‌యిత అరుణ్ కుమార్ శ‌ర్మ మాత్రం దీని గురించి ఓ పుస్త‌కంలో రాశారు.  దట్ మిస్టీరియస్ వ్యాలీ ఆఫ్ టిబెట్ పుస్త‌కంలో ఆయ‌న ఈ షాంగ్రి - లా వ్యాలీ గురించి మాట్లాడుతూ ప్ర‌పంచంలో ఏ వ‌స్తువు లేదా మ‌నుష్యులు అయినా మాయం అయ్యే ఫ‌స్ట్ ప్లేస్ బెర్ముడా ట్ర‌యాంగిల్ అయితే.... రెండో ప్లేసు ఖ‌చ్చితంగా ఈ షాంగ్రి లా వ్యాలీ అని చెప్పారు.

అయితే కొంద‌రు మాత్రం ఇది ఊహాజ‌నిత ప్రాంత‌మే అని.. దీని గురించి పూర్తిగా చూసిన వారు ఎవ్వ‌రూ లేర‌ని అంటున్నారు. మ‌రి ఇందులో వాస్త‌వ అవాస్త‌వాలు ఏంటో పూర్తిగా అయితే తెలియ‌దు.


మరింత సమాచారం తెలుసుకోండి: