మహిళ లైన , పురుషులైన చేతి మణికట్టు దగ్గరే వాచ్ పట్టుకోవడం జరుగుతుంది.. అంతేకాదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తున్నదే. సాధారణంగా చేతి మణికట్టు దగ్గర గడియారాన్ని కట్టుకున్నప్పుడు, అది మన పనికి ఆటంకం కాకుండా స్వేచ్ఛగా ఉండేలాగా చూసుకోవాలి. కొంతమంది ఏదైనా హడావిడిగా పనిచేస్తున్నప్పుడు, మణికట్టు మీద వెలుపలి భాగంలో గడియారం ఉండడం వల్ల, పనికి ఆటంకం కలుగుతుంది. గడియారం డయల్ మణికట్టు మీద కట్టుకున్నప్పుడు చేతి లోపలికి ఉండేలాగా చూసుకోవాలి. అదే ఆఫీసులకు ఏదైనా ఉద్యోగాలకు వెళ్లేటప్పుడు మణికట్టు వెలుపల కట్టుకోవడం వంటివి చేస్తే చాలా స్వేచ్ఛగా ఉండడమే కాకుండా పనికి కూడా ఆటంకం కలగకుండా ఉంటుంది..

ముఖ్యంగా ప్రపంచ జనాభాలో దాదాపుగా 90 శాతం మంది కుడిచేతి వాటం ఉన్నవారే ఉంటారు. కుడిచేతి వాటం ఎవరైతే ఉంటారో వారు ఎడమ మణికట్టు మీద వాచ్ ధరించడంవల్ల , చూడటానికి అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అంతేకాదు వాచ్ ను ఎడమచేతికి ధరించినప్పుడు, మనిషి యొక్క డిగ్నిటీ ని కూడా సూచిస్తుంది అని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. ఇకపోతే పెద్ద డయల్ వున్న గడియారాలను ధరించడం మంచిది కాదు. ముఖ్యంగా చేతి మణికట్టుకు అనుకూలంగా ఉండే చిన్న డయల్ ను  కట్టుకోవడం వల్ల చూడటానికి అందంగా కనిపించడమే కాకుండా మన పని కూడా ఆటంకం రాకుండా ఉంటుంది.ఇక మణికట్టు కిందకి కూడా గడియారాన్ని ధరించకూడదు. చూడటానికి అసహ్యంగా కనిపిస్తుంది. మణికట్టు కింద గడియారం ధరించడంవల్ల మనం ఏ పని కూడా సౌకర్యవంతంగా చేసుకోలేము.ఇకపోతే మరి కొంతమంది చేతి గడియారాలను వారి పనికి అనుకూలతను బట్టి ,మణికట్టు లోపల ధరించడానికి ఇష్టపడతారు. అయితే ఇక్కడ రూలేమీ లేదు.. వాచ్ ను మణికట్టు వెలుపల కట్టుకోవాలి లేదా లోపల కట్టుకోవాలి అన్న నిబంధనలు ఏమీ లేవు .కాబట్టి మన సౌలభ్యాన్ని బట్టి ధరించవచ్చు. ఇది మహిళ లైన పురుషులైన ఇద్దరికీ సమానంగా ఈ నియమం వర్తిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: