సాధారణంగా పోలీసులు అంటే ప్రజలకు రక్షణ కల్పిస్తూ ఉండాలి. ప్రజలకు ఎలాంటి అపాయం తలెత్తినా కూడా ముందుండి  ఇక ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా చూసుకోవాలి అంతే కాకుండా నేరాలను అరికట్టేందుకు ఎప్పుడూ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి. అయితే దాదాపుగా అందరు పోలీసులు ఇలాగే విధినిర్వహణలో ఎన్ని కష్టాలు ఎదురైనా పనిచేస్తున్నారు. కానీ కొంతమంది పోలీసులు మాత్రం అత్యుత్సాహం చూపిస్తూ ఏకంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. రక్షణ కల్పించాల్సిన ప్రజల పైన ఏకంగా లాఠీఛార్జి లకు పాల్పడుతున్నారు ఎంతో మంది పోలీసులు.


 ఇప్పటికే ఎంతో మంది పోలీసులు జనాలను దారుణంగా చితకబాదిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.ఇలా పోలీసులు చితకబాదిన ఘటనల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవటం కూడా చర్చనీయాంశంగా మారి పోయింది. అయితే ఇక ఇలాంటి ఘటనల తర్వాత ఉన్నత అధికారులు స్పందిస్తూ పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. అయితే ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చినప్పటి కొంత మంది పోలీసుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు.. ప్రజల విషయంలో ఇంకా దారుణంగానే వ్యవహరిస్తున్నారు. చేతిలో లాఠీ ఉంది కదా అని ఏం చేసినా చెల్లిపోతుంది అనే భావనతో దారుణంగా చితకబాదిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి. యూపీలోని కాన్పూర్లో ఓ వ్యక్తిపై పోలీస్ ఇన్స్పెక్టర్ విరుచుకుపడ్డాడు. లాఠీ చేతపట్టుకుని విచక్షణారహితంగా కొట్టాడు. అయితే చేతిలో ఒక పసిబిడ్డను ఎత్తుకున్నాడు అని కూడా చూడకుండా దారుణంగా చితకబాదాడు.  దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. యూపీలోని కాన్పూర్లో స్థానిక ఆస్పత్రి వద్ద కొందరు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిరసన విరమించాలి అంటూ పోలీసులు కోరగా.. వాళ్ళు విరమించడానికి ఒప్పుకోలేదు. దీంతో లాఠీకి పని చెప్పారు పోలీసులు. పిల్లాడిని ఎత్తుకున్న ఒక వ్యక్తి పై ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ విరుచుకుపడుతూ దారుణంగా లాఠీతో చితకబాదాడు. పిల్లాడి ప్రాణాలు పోతాయి సార్ వదిలేయండి అంటూ బ్రతిమిలాడిన వినిపించుకోలేదు. ఈ ఘటనపై స్పందించిన ఉన్నత అధికారులు సదరు ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: