కరోనా మహమ్మారి గత రెండు సంవత్సరాలుగా ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. ఇకపోతే తాజాగా మొదటి రెండు దశల ద్వారా ప్రజలు నష్టపోయారు అని అందరికీ తెలిసిందే.. అయితే ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది.. ఇప్పుడు మూడవ దశ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టిందని చెప్పవచ్చు. అయితే ఒమిక్రాన్ పేరిట మూడవ దశ చెలరేగినా ఇప్పుడు కొంత వరకు ఉపశమనం కలిగిందని చెప్పాలి.. ఇక అలా దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో కరోనా కేసులు కూడా చాలావరకు తగ్గాయి.. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పవచ్చు.. ఇకపోతే ఇప్పుడు మరొకసారి కేరళలో భారీగా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు అరచేతుల్లో ప్రాణాలను పెట్టుకున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా మంకీ ఫీవర్ కేరళ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. వయనాడ్ జిల్లా కు చెందిన 24 ఏళ్ల యువకుడికి ఈ వైరస్ సోకింది. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సకీనా ధృవీకరించడం జరిగింది. ఇక ఆరోగ్య అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశామని స్థానిక ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇకపోతే వైద్య అధికారులు సూచించిన విషయాల మేరకు యువకుడి పరిస్థితి మెరుగ్గానే ఉందని, మనవంతవాడి  మెడికల్ కాలేజీలో  ఆ యువకుడిని చేర్చగా వైద్యుల పరిశీలనలో ఉన్నట్లు ఒక వైద్యాధికారి వెల్లడించారు..


ఇకపోతే ఈ సంవత్సరం మంకీ ఫీవర్ తొలి కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి.. ఇకపోతే మంకీ ఫీవర్ ఫ్లావివిరిడే  కుటుంబానికి చెందిన వైరస్ ద్వారా వ్యక్తులకు సోకుతుందని నిపుణులు తెలిపారు. ఈ మంకీ ఫీవర్ సోకినవారిలో ఒళ్ళు నొప్పులు, అధిక జ్వరం తో పాటు డెంగీ లక్షణాలు కూడా ఉంటాయని అంతే కాదు ఐదు నుంచి పది శాతం మరణాలు కూడా సంభవిస్తాయి అని వైద్యులు తెలిపారు. వైరస్ అనేది ఎప్పుడు..ఎక్కడ నుంచి.. ఎలా  వ్యాపిస్తుందో తెలియదు కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని  వైద్యులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: