సాధారణంగా హెలికాప్టర్లు విమానాలు ఏదైనా తుఫాను వస్తుంది అని తెలిస్తే మాత్రం గాల్లోకి ఎగరకుండా తుఫాన్ ప్రభావం తగ్గేంత వరకు నిలిచి ఉంటాయి అని తెల్సిందే. ఇక కొన్ని కొన్ని సార్లు హెలికాప్టర్లు తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు లేదా సాంకేతిక లోపం తలెత్తినా సమయంలో  కుప్పకూలిపోవటం జరుగుతుంది. ఇలా హెలికాప్టర్ కుప్పకూలి పోయినా ఘటనలు ఎన్నో  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. కాగా వరకు ఎన్నో హెలికాప్టర్ క్రాష్ ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఇక ఇప్పుడు మరో వీడియో అందరినీ షాక్ కి గురి చేస్తోంది .


 ఇటీవలే మరో హెలికాప్టర్ హెలికాప్టర్ కాస్ట్ కి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం బ్రిటన్లో యూనిస్ ఏ రేంజ్ లో బీభత్సం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవలే యూనిస్ తుఫాన్ కారణంగా గాల్లో ఉన్న విమానం ఎంత ప్రమాదకర రీతిలో ల్యాండ్ అయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే విమానం కుప్పకూలిపోతుంది అనుకుంటున్న సమయంలో ప్రమాదకర రీతిలో ల్యాండ్ అవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల  ఒక హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. అందరూ చూస్తుండగానే ఆ హెలికాప్టర్ కిందకి పడిపోతూ ఇక సముద్రంలో కుప్పకూలింది.



 దీంతో బీచ్ లో ఉన్న పర్యాటకులు అందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనలో మునిగిపోయారు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక హెలికాప్టర్ కుప్పకూలి పోయింది. భారత కాలమానం ప్రకారం 01:20 గంటలకు ఫ్లోరిడాలోని రద్దీగా ఉండే మియామీ బీచ్ లో ఎంతో మంది పర్యాటకులు ఉన్నారు. ఈ క్రమంలోనే  ముగ్గురు ప్రయాణికులతో కూడిన ఒక హెలికాప్టర్ అక్కడికి దూసుకొచ్చింది. ఇక సాంకేతిక లోపం తలెత్తడంతో క్రమక్రమంగా కిందకి పడిపోతూ వచ్చింది. ఈ క్రమంలో చివరికి సముద్రంలో కుప్పకూలిపోయింది. ఈ విషయాన్ని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. హెలికాప్టర్ క్రాష్ కి గల కారణాలు ఏంటి అన్న దానిపై ఏజెన్సీ దర్యాప్తు మొదలు పెట్టింది.. గాయాలపాలైన ఇద్దరు ప్రయాణికులను స్థానిక ఆసుపత్రికి  తరలించినట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: