పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలో ఉండే సింగరేణి ఆండ్రియా లాంగ్ వాల్ ప్రాజెక్టు ఈ రోజున ఒక ఘోరమైన ప్రమాదం చోటుచేసుకుంది.. ఆ గని పైకప్పు కూలడంతో అక్కడికక్కడే నలుగురు కార్మికులు మృతి చెందడం జరిగిందట. ఇక వీరితో పాటు మరో నలుగురు కార్మికులు కూడా తీవ్రంగా గాయాలైనట్లు గా సమాచారం. ఆ గాయపడిన కార్మికులకు చికిత్స చేయించడానికి రామగుండం ఏరియా లో ఉండే ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఇక మృతి చెందిన వారిలో అసిస్టెంట్ మేనేజర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గని ప్రమాదానికి గా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.


అయితే ఆడ్రియాలా లాంగ్ వాల్ ప్రాజెక్టులో నలుగురు కార్మికులు మృతి చెందినట్లుగా జరుగుతున్న ఈ ప్రచారంపై అందులోని కార్మికులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. 86 లెవెల్ వద్ద మొత్తం 8 మంది కార్మికులు వర్క్ చేస్తూ ఉండగా పైకప్పు కూలి నట్లుగా తెలియజేయడం జరిగింది. అయితే వీరిలో నలుగురు క్షేమంగా ఉన్నారని.. మిగిలిన నలుగురు శిధిలాల కింద ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని.. శిధిలాల కింద నుండి వారిని తీసుకువచ్చేందుకు కనీసం 3 గంటల సమయమైనా పట్టొచ్చని తెలియజేస్తున్నారు అధికారులు. ఇక ఇలా జరగడానికి ముఖ్య కారణం అధికారుల నిర్లక్ష్యమే అని కార్మిక సంఘాల నేతలు తెలియజేస్తున్నారు.



గత సంవత్సరం నవంబర్ నెలలో కూడా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్లో SRP-3 గనిలో పని చేస్తున్నటువంటి కార్మికులు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే మృతుల కుటుంబాన్ని కి సింగరేణి యాజమాన్యం మాత్రం కోటి రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించినదట. అంతేకాకుండా ఆ కుటుంబంలోని ఒకరికి కచ్చితంగా ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఇది జరిగిన కొద్ది రోజులకే మరొక గని లో పురుషోత్తమ అనే అండర్ మేనేజర్ మృతి చెందారు. దీంతో గని కార్మికులు ప్రమాదాలపై చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: