తల్లిదండ్రుల తర్వాత ప్రత్యక్ష దైవం గురువు అని చెబుతూ ఉంటారు ప్రజలు . ఎందుకంటే తల్లిదండ్రులు కేవలం జన్మనిస్తే గురువులు మాత్రం ఆ జీవితానికి పరమార్థం చూపి  సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటారు. ఇక సభ్య సమాజంలో ఎలా నడుచుకోవాలి అన్న విషయాన్ని నేర్పుతూ ఉంటారు గురువులు. అందుకే విద్యార్థులకు గురువులకు మధ్య ఒక ప్రత్యేకమైన బంధం ఉంటుంది. అయితే ఎక్కడ చదువుకున్న ఎక్కడికి వెళ్ళినా ఎంత గొప్ప స్థాయిలో ఉన్న ఇక మనకు చదువు చెప్పిన గురువులు కనిపించారూ అంటే చాలు మనకు తెలియకుండానే ఒక గౌరవప్రదమైన నమస్కారం చేస్తూ ఉంటాము అన్న విషయం తెలిసిందే. అంతలా గురువులు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన పాత్రను పోషిస్తూ ఉంటారు.


 అయితే ఇక కొంత మంది ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులు మరింత అమితమైన ప్రేమ అభిమానం కలిగి ఉంటారు. ఇలాంటి పంతులు మాకు దొరకడం ఎంతో అదృష్టం అంటూ భావిస్తూ ఉంటారు. కానీ అలాంటి ఉపాధ్యాయుల చివరికి  బదిలీ అయ్యి వెళ్లిపోతున్నారూ అని తెలిస్తే ఆ విద్యార్థులు గుండె బద్దలయినంత పని అవుతూ ఉంటుంది. విద్యార్థి దశలో ఉన్నప్పుడు మీకు కూడా ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది. మీకు ఇష్టమైన టీచర్ స్కూల్ వదిలి బదిలీపై వెళ్తున్న సమయంలో గుండెల్లో నుంచి ఉప్పొంగుకోస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక మీరు కూడా ఏడ్చే ఉంటారు.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. చందౌలి జిల్లాలో రాయగడ్ అనే ఒక మారుమూల ప్రాంతం ఉంది. కొండమీద ఉండడంతో అక్కడ అక్షరాస్యత కూడా చాలా తక్కువే. కాగా నాలుగేళ్ల క్రితం శివేంద్ర సింగ్ అనే ఉపాధ్యాయుడు ఇక్కడికి వచ్చి విద్యార్థుల మనసులు గెలుచుకున్నాడు. అతను చెప్పే పాఠాలు అంటే విద్యార్ధులందరూ ఎంతో అమితంగా ఇష్టపడేవారు. ఇక అతని విద్యాబోధన అక్కడ తల్లిదండ్రులకు కూడా నచ్చడంతో ఎంతోమంది తమ పిల్లలను బడికి పంపించడం మొదలు పెట్టారు. ఇక నాలుగేళ్లలో ఆ స్కూల్లో విద్యార్థులు చదువు మెరుగుపడటమే కాదు హాజరు శాతం కూడా పెరిగింది. కానీ ఇటీవలే శివేంద్ర సింగ్ బదిలీ కావాల్సి వచ్చింది. తమతో పాటే ఉన్న ఉపాధ్యాయులు తమ ను వదిలి వెళ్లడానికి ఆ విద్యార్థులు తట్టుకోలేకపోయారు. దీంతో మమ్మల్ని వదిలి వెళ్ళద్దు అంటూ ఉపాధ్యాయుని పట్టుకొని బోరున విలపించారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  ఇది చూసి ప్రతి ఒక్కరు కూడా తమ స్కూల్ లైఫ్ ని గుర్తు చేసుకుంటున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: