సాధారణంగా వాహనంపై ఎక్కడికైనా వెళుతున్న సమయంలో రైల్వే ట్రాక్ పై కొన్ని కొన్ని సార్లు గేటు వేసి ఉంటుంది. పట్టాలపై రైలు దూసుకొస్తున్నప్పుడు మాత్రమే ఇలాగే ఓటు వేసి వాహనదారులు నిలిపి వేయడం లాంటివి చేస్తూ ఉంటారూ. అయితే ఇక ఇలాంటి సమయంలోనే వాహనదారులు కాస్త బండి ఆపి సాఫీగా ఫోన్ మాట్లాడుకోవడం చేస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. కానీ రైలు వచ్చే సమయంలో గేటు వేసినప్పుడు తమకు ఎలాంటి ప్రమాదం లేదు అనుకుంటే పొరపాటే. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిందే  అన్నది మాత్రం ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే అర్థమవుతుంది.

 ఇటీవల కాలంలో దొంగలు ఎక్కడ బడితే అక్కడ ప్రత్యక్షమవుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఎవరూ లేని ఇళ్ళ లోకి వెళ్లి చోరీ చేసే దొంగలు ఇక ఇప్పుడు అందరూ చూస్తుండగా దోపిడీలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలికాలంలో చైన్ స్నాచింగ్ మొబైల్ చోరీలు బాగా పెరిగిపోయాయని చెప్పాలి. ఏ మాత్రం ఆదమరిచి ఉన్న చివరికి ఊహించని షాక్ ఇస్తున్నారు దోపిడి దొంగలు  ఇలాంటి సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతు ఉన్నాయి అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.


 పట్టాలపై రైల్ వెళ్తున్న సమయంలో అక్కడ వాహనదారులు వెళ్లకుండా గేట్ వేసారు రైల్వే అధికారులు. దీంతో వాహనదారులు అందరూ కూడా గేట్ కి ఇవతలి వైపు వేచి చూస్తున్నారు. ఇంతలోనే మరో వైపు నుంచి ఒక దొంగ అక్కడికి వచ్చాడు. మొదట ఒక సాధారణ వ్యక్తిలా కనిపించాడు. అయితే అదే సమయంలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ లీనమై పోయాడు. ఇంతలో అక్కడికి వచ్చిన వ్యక్తి ఇక అతని చేతిలో నుంచి మొబైల్ లాక్కొని పరిగెత్తాడు. వాహనంపై ఉన్న వ్యక్తి కూడా బైక్ దిగి అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా... అప్పుడే రైలు దూసుకొచ్చింది. దీంతో ఏమీ చేయలేక ఇటువైపే ఉండిపోయాడు. ఈ ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: