భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన కాశ్మీర్ లో ఎప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయన్న విషయం తెలిసిందే . పాకిస్తాన్ ఎప్పుడు భారత్లోకి ఉగ్రవాదులను పంపిస్తూ మారణహోమం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.  ఈ క్రమంలోనే ఉగ్రవాదులు అటు ఆర్మీ కంటపడకుండా ఆయుధాలను తరలించడం లేదా మాదక ద్రవ్యాల సరఫరాను చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.. మరి కొంతమంది ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడుతూ మారణహోమం సృష్టించటం చేస్తూ ఉంటారు. కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత పరిస్థితులు కాస్త చక్కబడినట్లు కనిపించాయి.


 కానీ ఇటీవలి కాలంలో మరోసారి కాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది ఉగ్రవాదులు అటు భారత్లో ఉన్న కాశ్మీర్లో కి రహస్యంగా చొరబడుతున్నారు. ఇలాంటి సమయంలోనే అటు భారత ఆర్మీ కూడా ఎంతో అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు ఆపరేషన్ నిర్వహిస్తూ ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఇకపోతే ఇటీవల భారత ఆర్మీ ఒక ఆసక్తికర వీడియో విడుదల చేసింది. ఇద్దరు పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ మైన్ ఫీల్డ్ లోకి ప్రవేశించారు. దీంతో ఒక్కసారిగా పేలిపోయి తునాతునకలు అయ్యారు.


 జమ్మూ కాశ్మీర్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వద్ద ఈ ఘటన జరిగింది అన్నది తెలుస్తుంది. ఆగస్టు 22వ తేదీన నౌషర సెక్టార్లో నియంత్రణ రేఖ కు 150 మీటర్ల దూరంలో పాకిస్థాన్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు అనుమానాస్పదంగా సంచరించడం భారత ఆర్మీ గుర్తించింది. అయితే ఉగ్రవాదులు అక్కడి మైన్ ఫీల్డ్ లోకి ప్రవేశించారు.  ఈ క్రమంలోనే ల్యాండ్ మైన్ పై అడుగు పెట్టారు. ఇలా భారత భూభాగంలోకి అడుగు పెట్టారో లేదో క్షణాల వ్యవధిలోనే పేలుడు సంభవించి తునాతునకలు అయిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారని డ్రోన్ల సహాయంతో గుర్తించింది ఇండియన్ ఆర్మీ. ఈ వీడియో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: