ఎప్పుడు సోషల్ మీడియాలో ఎన్నో రకాల  వీడియోలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.  ఇక ఇలా వైరల్ గా  మారిపోయిన వీడియోలు కొన్ని ప్రత్యేకంగా నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ఏదో చేయాలని భావిస్తే ఇంకేదో జరిగిపోతూ ఉంటుంది. ఇటీవలి కాలంలో ఏదో ఒక స్టంట్  చేసి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలి అని ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు.  అయితే స్టంట్  చేయడం అనేది ఒక ఆర్ట్.. స్టంట్  చేస్తే కేవలం ధైర్యం ఉంటే సరిపోదు దానికి సరిగ్గా ప్రాక్టీస్ కూడా ఉండాలి.


 ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే ఎలాంటి ముందు జాగ్రత్తలు లేకుండానే స్టంట్ చేస్తాను సోషల్ మీడియాలో ఫెమస్   అవుతాను అనుకుంటే మాత్రం చివరికి ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అవుతూ ఉంటుంది. అందరి ముందు అభాసుపాలు కావడమే కాదు చివరికి గాయాల బారిన పడే పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే . ఇక్కడ ఇలాంటిదే జరిగింది.  సూరత్ లోని పార్వత్  ప్రాంతంలో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే వినాయకుడి పూజ జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా తనలో దాగివున్న ప్రతిభను ప్రదర్శించి అందరి మన్ననలు పొందాలి అని భావించాడు ఒక వ్యక్తి.


నోట్లో  పెట్రోల్ పోసుకొని గాల్లో మంటలు తెప్పించి అందరినీ అవాక్కయ్యేలా చేయాలి అనుకున్నాడు. ఇలా చేయడం ద్వారా ఒక వైపు వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే లైకులు వస్తాయని భావించాడు. కానీ ఈ  స్టంట్ కాస్త ఫెయిల్ అయ్యింది. మొదట అనుకున్నట్లుగానే గాల్లోకి మంటలు వదులుతాడు.   కానీ ఆ తర్వాత ఆ మంటలు అతడికే అంటుకున్నాయి.  దీంతో ఆ సదరు వ్యక్తి షర్ట్ విప్పేందుకు పక్కన ఉన్న వారు సహాయం చేశారు. ఇలా చిన్నపాటి గాయాలతో చివరికి సదరు వ్యక్తి ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నాడు అని చెప్పాలి. ఈ వీడియో ట్విట్టర్  లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vir