ఇటీవల కాలం లో ఎక్కడ చూసినా దొంగలు బెడదా కాస్త ఎక్కువ గానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  ఇక ఎక్కడికి వెళ్లినా ఏం చేస్తున్నా.. అలెర్ట్ గా ఉండాల్సిందే. ఏమాత్రం ఏమరు పాటుగా ఉన్నా ఇక చివరికి విలువైన వస్తువులను కోల్పోవాల్సిన పరిస్థితి నేటి రోజుల్లో నెలకొంది. ముఖ్యం గా రైలు ప్రయాణాలు చేసేటప్పుడు అయితే దొంగల నుంచి ఎప్పటికప్పుడు అప్రమత్తం గా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే దొంగలు ఎప్పుడూ ఎటువైపు నుంచి ఎటాక్ చేసి చోరీలకు పాల్పడతారు అన్నది ఊహకం గానే ఉంటుంది.


 ఇటీవల కాలం లో రైలు కదులుతున్న సమయం లో ప్లాట్ఫారం మీద నుంచి దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు లోకి వస్తున్నాయి.. ఇక్కడ స్టేషన్ నుంచి కదులుతున్న రైలు లో చోరీ చేసేందుకు ఒక దొంగ ప్రయత్నించాడు. కానీ ప్రయాణికులు అప్రమత్తమై అతనికి చుక్కలు చూపించారు అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. రైలు భోగి కిటికీ నుంచి చేతిని లోపలికి పెట్టి సెల్ ఫోన్ లాక్కోబోయాడు దొంగ.


 అప్రమత్తమైన ప్రయాణికులు అతని చేతిని అతను ధరించిన టీషర్టును కూడా గట్టిగా పట్టుకున్నారు. ఈ క్రమం లోనే రైలు కదులుతున్నప్పటికీ అతన్ని మాత్రం వదలలేదు. చివరికి ఒకచోట అతని లోపలికి లాగే చివరికి దారుణం గా ఆ దొంగను చితక్కొట్టారు ప్రయాణికులు. ఈ ఘటన బీహార్ లోని భాగల్పూర్ జిల్లాలో వెలుగు చూసింది అని చెప్పాలి. జమాల్పూర్- సాహిబ్ గంజ్ పాసింజర్ రైలు లైలాక్, గెగ స్టేషన్ ల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కాగా ఇలా దొంగ రైలు బయట వేలాడిన వీడియో ఇక ఆ తర్వాత అతనిలోపలికి లాగి ప్రయాణికులు చితక్కొట్టిన వీడియో ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా తెగ వైరల్ గా మారిపోయింది  అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: