సాధారణంగా అడవుల్లో ఉండే క్రూర మృగాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అందులో మొదటి వరుసలో వినిపించే పేరు చిరుత పులి అని. చిరుత పులి అడవుల్లో ఉండే మిగతా జంతువులు అన్నింటికంటే ఎంతో వేగంగా ఇతర జంతువులను వేటాడుతూ ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉంటుంది. ఇక అలాంటి చిరుత పులి ఇటీవల కాలంలో జనావాసాల్లోకి కూడా వస్తూ దాడులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే చిరుత పులి ఎక్కడైనా కనిపించిందంటే చాలు ప్రాణాలను రక్షించుకోవడానికి అక్కడి నుంచి పరుగో పరుగు అంటారు అందరూ.


 ఇలాంటి క్రూరమృగం దగ్గరికి వెళ్లడానికి ఎవరు అంతలా ధైర్యం చేయరు అని చెప్పాలి. కానీ కొంతమంది మాత్రం ఇటీవల కాలంలో ప్రాణాలను హరించే క్రూర మృగాలను సైతం పక్కన పెట్టుకొని ఫోటోలు దిగుతూ వీడియోలు తీస్తూ ఉండడం లాంటి ఘటనలు తరచూ సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్నాయి.  ఇక్కడ ఒక యువతి అయితే ఒక అడుగు ముందుకు వేసి మరింత సాహసం చేసింది. ఏకంగా పులి నోట్లో తలపెట్టినంత పని చేసింది. ఏకంగా చిరుత పులికే లిప్ కిస్ ఇచ్చింది. చిరుత హాయిగా సేద తీరుతున్న సమయంలో పక్కనే కూర్చున్న యువతి ఏకంగా చిరుత పులితో రొమాన్స్ చేసింది. ఈ క్రమంలోనే ప్రాణాలు తీసే చిరుత పులికి లిప్ లాక్ ఇస్తూ ఎంతో మైమరిచిపోయింది ఆ యువతి. ఇక చిరుత కూడా ఏం అనకుండా యువతితో అంతే ప్రేమగా ప్రవర్తించడం గమనార్హం. అయితే చిరుత పులి ఆ యువతీ పెంపుడు జంతువు అన్న విషయం మాత్రం తెలుస్తుంది. ఆఫ్రికన్ యానిమల్ అనే యూజర్ ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ వీడియోని పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది. అందమైన యువతి చిరుత పులికి ఎంతో ధైర్యంగా లిప్ కిస్ ఇవ్వడం పై అటు నెటిజన్లు కూడా అవాక్కవుతున్నారు అని చెప్పాలి. ఒకే ఫ్రేమ్ లో రెండు చిరుతలు అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: