సాధారణంగా విషపూరితమైన పాములకు సంబంధించిన వీడియోలు ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉంటాయి అనే విషయం తెలిసిందే. ఇలా ప్రమాదకరమైన పాములకు సంబంధించిన వీడియో ఏవైనా సోషల్ మీడియాలోకి వచ్చాయి అంటే చాలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో అయితే ఎంతోమంది కాస్త ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ విషపూరితమైన పాములను ఎంతో అలవోకగా పట్టేస్తూ ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.



 ఇటీవల కాలంలో ఎంతోమంది ఏకంగా నాగుపాము కు ముద్దు పెట్టడం లాంటివి కూడా చేస్తూనే ఉన్నాము. ఇక ఇటీవల ఒక వ్యక్తి ఏకంగా నాగుపామును ముద్దు పెట్టబోయి చివరికి ఆ పాము కాటుకు గురైన ఘటన వెలుగులోకి వచ్చి అందరినీ అవ్వక్కయ్యేలా చేసింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు  కొడుతుంది అని చెప్పాలి. నాగుపాము కంటే ఎంతో ప్రమాదకరమైన కింగ్ కోబ్రా కి ఇక్కడ ఒక వ్యక్తి ముద్దు పెట్టాడు. ఒకవైపు కింగ్ కోబ్రా పడగవిప్పి  బుసలు కొడుతున్న సమయంలో అతను మాత్రం భయపడకుండా బుసలు కొడుతున్న పడగ పైన ముద్దు పెట్టడం గమనార్హం.



 ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. హార్ట్ రైజింగ్ స్టంట్ వీడియోని ఇక సౌరబ్ జాదవ్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్  లో షేర్ చేశాడు. ఈ స్టంట్ లో భాగంగా కింగ్ కోబ్రా తలపై ముద్దు పెట్టాడు. అయితే ఈ స్టంట్ చేసిన వ్యక్తి సురేష్ అనే కేరళ వాసి కావడం గమనార్హం.. ఇప్పటివరకు అతని జీవితంలో 38వేల విషసర్పాలు పట్టుకున్నాడు సురేష్. 3వేల సార్లకు పైగా పాముకాటుకు గురయ్యాడు. 190 కి పైగా కింగ్ కోబ్రాలను అతను రక్షించాడు అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: