సాధారణంగా ఏదైనా ఊరికి వెళ్లాలి అనుకున్నప్పుడు బస్సు రైలు లాంటి వాటిపైన ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు ఎంతోమంది . ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇక ట్రైన్ ప్రయాణం బెస్ట్ అని భావిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా భారత్ లో ట్రైన్ లు సమయానికి రావు అన్న ఒక వాదన కూడా ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సార్లు వాతావరణం అనుకూలించక లేదా సాంకేతిక లోపాలు ఏర్పడి ఏకంగా గంటల తరబడి ట్రైన్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.



 అయితే ఇక ఇలా ట్రైన్ కోసం వేచి చూడాల్సి వచ్చినప్పుడు ఎవరికైనా సరే సహజంగా కోపం చిరాకు లాంటివి వస్తూ ఉంటాయి. ఇంకోసారి ట్రైన్ జర్నీ చేయకూడదు అని కొంతమంది మనసులో కూడా తమను తాను తిట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా రైల్వే ప్రయాణికులకు ఇలాంటి అనుభవమే ఎదురయింది అని చెప్పాలి. ఒక గంట రెండు గంటలు కాదు ఏకంగా ట్రైన్ కోసం 9 గంటల పాటు ఫ్లాట్ ఫామ్ పైనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ట్రైన్ వస్తుందా రాదా అన్న చిరాకు అందరిలో నిండిపోయింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ట్రైన్ వచ్చే రూట్ వైపే ఇక అక్కడ ఫ్లాట్ ఫామ్ మీద ఉన్న వందల మంది ప్రయాణికుల చూపులు ఉన్నాయి అని చెప్పాలి.  నిరీక్షణ తర్వాత ట్రైన్ అక్కడికే రానే వచ్చింది. దీంతో అప్పటివరకు ఎంతో నిరీక్షణగా ఎదురుచూసిన ప్రయాణికులు అంతా ఏదో లాటరీ తగిలిందేమో అన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ట్రైన్ ను చూసిన తర్వాత సంతోషంతో ఊగిపోయి విజిల్స్ వేస్తూ డాన్స్ చేశారు. అంతేకాదు దూరం నుంచి ట్రైన్ కు సంబంధించిన లైట్ వెలుగు కనిపించగానే ప్రయాణికుల ముఖాలు మొత్తం ఒక్కసారిగా వెలిగిపోయాయి అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: