
కానీ ఒకవేళ మృగరాజు ఏకంగా జనావాసాల్లోకి వస్తే.. అక్కడ ఉన్న పాడి పశువులపై దాడి చేస్తే ఎలా ఉంటుంది. ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది కదా. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే ఏకంగా ఒక ఆవు కట్టేసున్న ప్రాంతంలోకి రెండు సింహాలు వచ్చాయి. ఏకంగా ఆవును వేటాడేందుకు ప్రయత్నించాయి. కానీ ఇక ఆవు రెండు సింహాలను చూసి ఎంతగానో అలెర్ట్ అవుతుంది.
దీంతో రెండు సింహాలను చూసి వాటికి భయపడి సరెండర్ అవ్వకుండా.. ప్రాణాలను రక్షించుకునేందుకు తీవ్రంగా పోరాటం చేస్తుంది. ఇక సింహాలను దాడి నుంచి తప్పించుకుంటూ ప్రతిఘటించి ఏకంగా కొమ్ములతో కుమ్మేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఇక ఇది గమనించిన సింహాలు వెంటనే అక్కడి నుంచి జారుకున్నాయి అని చెప్పాలి. ఇలా ఏకంగా ఒక ఆవు సింహాల నుంచి తనను తాను రక్షించుకోవడం చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు అని చెప్పాలి.