సాధారణంగా కుక్కలకి మనుషులకి మధ్య బంధం ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తుంది. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఇక మనుషులకి శునకాలకి మధ్య బంధం మరింత బలపడింది అన్నదానికి నిదర్శనంగా ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. సాధారణంగా ఒకప్పుడు కుక్కలని కేవలం ఇంటికి కాపలాగా మాత్రమే పెంచుకునేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఇంటికి కాపలాగా కాదు ఏకంగా ఇంట్లో మనిషిలాగ కుక్కలను దగ్గరకు తీసుకుంటున్నారు మనుషులు.


 ఇక కొంతమంది జంతు ప్రేమికులు అయితే మనుషుల మీద చూపించిన ప్రేమ కంటే కుక్కల మీద అమితమైన ప్రేమ చూపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఏకంగా సొంత మనిషిలా భావిస్తూ ఇక కుక్కలకు సంబంధించిన ఆలనా పాలన దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇంకొంతమంది కేవలం ట్రెండ్ ఫాలో అవ్వడానికి మాత్రమే కుక్కలను కొనుగోలు చేస్తూ ఇక ఇంట్లో పెంచుకుంటున్న ఘటనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే కుక్కలకి మనిషికి మధ్య బాండింగ్ ఎంతలా పెరిగిపోయింది అన్నదానికి నిదర్శనంగా ఇక్కడ ఒక వీడియో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.


 సాదరణంగా పెళ్లి అంటే చాలు హడావిడి ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక వధూవరులు కేవలం పెళ్లి విషయం గురించి తప్ప మిగతా ఏ విషయం గురించి కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ ఇక్కడొక వధువు మాత్రం పెళ్లి హడావిడిలో కాసేపు బ్రేక్ తీసుకొని తన పెంపుడు కుక్కకు ఆహారం తినిపిస్తుంది. ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. దివ్య అనే పెళ్లి కూతురు ఇలా ముస్తాబౌతు డ్రెస్ వేసుకుంటూనే కొద్దిసేపు పెంపుడు కుక్కకు బిర్యాని తినిపించింది. ఇక ఇలా పెళ్లికూతురు కుక్కకు బిర్యాని తినిపిస్తూ ఉండడాన్ని అక్కడ ఉన్న మేకప్ ఆర్టిస్ట్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో ఎంతో మంది హృదయాలను తాకుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: