ఇటీవల కాలంలో ఎక్కడ చుసిన దొంగలు బెడద ఎక్కువైపోయింది అన్న విషయం తెలిసిందే  ఎంతో చాకచక్యంగా దొంగతనాలకు పాల్పడి ఇక అందిన కాడికి దోచుకుపోవడానికి ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు  ఏర్పాటు చేసినప్పటికీ కూడా అటు దొంగల తీరులో మాత్రం మార్పు రావడం లేదు అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఒక కస్టమర్లాగా షాప్ కి వచ్చి ఇక తనకు కావలసిన వస్తువులు చాకచక్యంగా దొంగలించకపోవడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అవడంతో చివరికి చోరీలకు సంబంధించిన వీడియోలు బయటికి వస్తూనే ఉన్నాయి.


 ఇలా కొన్ని కొన్ని సార్లు షాప్ కి వచ్చిన దొంగ తనకు కావాల్సిన వస్తువు చోరీ చేయడంలో సక్సెస్ అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం చివరికి చోరీ చేస్తూ చివరికి దొరికిపోయి జైలు పాలు అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ జరిగిన ఘటన మాత్రం మరింత విచిత్రమైనది అని చెప్పాలి. అచ్చంగా సినిమాల్లో జరిగే ఒక ఫన్నీ సన్నివేశం లాగానే ఇక్కడ ఒక దొంగకు చేదు అనుభవం ఎదురయింది. ఇక ఇది చూసిన తర్వాత పాపం ఈ దొంగకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు అంటూ ఎంతో మంది నేటిజన్స్ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. యూకే లోని ఫోన్ మార్కెట్ కి ఒక దొంగ కస్టమర్ లాగా షాప్ లోకి వచ్చాడు.


 ఈ క్రమంలోనే లక్షల రూపాయలు ఖరీదు చేసే ఐఫోన్లను చూపించాలి అంటూ అక్కడ ఉన్న షాప్ యజమానిని కోరాడు. ఇక ఇలా ఐఫోన్లు చూపిస్తూ ఉండగా రెండు చేతుల్లో రెండు ఫోన్లు పట్టుకున్న దొంగ ఎంతో తెలివిగా ఇక అక్కడ నుంచి పరుగులు పెట్టాలి అని అనుకున్నాడు. కానీ అంతకుముందే సమయస్ఫూర్తితో వ్యవహరించిన షాప్ యజమాని డోర్స్ లాక్ చేశాడు. దీంతో అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన దొంగకు ఇక డోర్ తెరుచుకోకపోవడంతో ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ వచ్చి తన చేతుల్లో ఉన్న రెండు ఐఫోన్లను షాప్ యజమానికి ఇచ్చేశాడు. ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: