ఇటీవల కాలంలో మనిషిని మృత్యువు ఎప్పుడు పలకరిస్తుంది అన్నది కూడా కూడా ఊహకందని విధంగానే మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో కేవలం నిమిషాల వ్యవధిలో ఊహించిన రీతిలో మృత్యువు  దరి చేరుతుంది. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో సడన్ హార్ట్ ఎటాక్ కారణంగా హఠాత్మరణం చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది అని చెప్పాలి. ఏజ్ తో సంబంధం లేకుండా చిన్నల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఇలా సడన్ హార్ట్ ఎటాక్ తో సెకండ్ల వ్యవధిలోనే ప్రాణాలు వదులుతున్నారు అని చెప్పాలి.


 మూడు పదుల వయసు కూడా దాటని వారు చివరికి యంగర్స్ సైతం గుండెపోటుతో మరణిస్తూ ఉన్న ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. అయితే ఒకప్పుడు కేవలం వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి మాత్రమే ఇక హార్ట్ ఎటాక్ లాంటివి వచ్చేవి అని అందరూ భావించేవారు. కానీ ఇటీవల కాలంలో ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు తరచూ వ్యాయామం చేస్తూ ఫిట్ గా ఉన్నవారు సైతం చివరికి ఇలా సడన్ హార్ట్ ఎటాక్ తో చనిపోతూ ఉండడం చూస్తూ ఉన్నాం అని చెప్పాలి.


 ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కూడా ఏకంగా ఒక డాక్టర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన పేరు సంజీవ్ పాల్. వయసు 41. తరచూ జిమ్ కి వెళ్లి వర్కౌట్లు చేస్తూ ఇక ఎంతో ఫీట్ గా ఉంటారు. ఇటీవల ఎప్పటిలాగానే జిమ్ కి వెళ్లి వర్కౌట్స్ చేస్తున్నారు. కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అక్కడే ఉన్నవారు గమనించి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ వీడియో ట్విట్టర్లో  వైరల్ గా మారింది. అయితే ఫిట్ గా ఉంటూ.. మెరుగైన ఆరోగ్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకునే డాక్టర్లకే ఇలాంటి పరిస్థితి వస్తే.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో అంటూ అందరూ భయపడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: