ఇటీవల కాలంలో ఎంతోమంది అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ చూపిస్తున్నారు. టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటూ ఎన్నో కొత్త ఆవిష్కరణలకు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి కొత్త ఆవిష్కరణలు కొన్ని కొన్ని సార్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటిదే జరిగింది. ఏకంగా అతను తయారు చేసిన సైకిల్ ప్రస్తుతం ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తుంది. సాధారణంగా అయితే ప్రతి ఒక్కరికి సైకిల్ తొక్కిన అనుభవం ఉండే ఉంటుంది.



 నేటి రోజుల్లో యువత అయితే ఇలా సైక్లింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు అని చెప్పాలి. అయితే సైకిల్ తొక్కుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు వాటి చక్రాలు ఎలా ఉంటాయి అని. గుండ్రటి  ఆకారంలో సైకిల్ చక్రాలు ఉంటాయి. కానీ చతురస్త్రాకారంలో సైకిల్ చక్రాలు ఉండడం ఎప్పుడైనా చూశారా. చతురస్రాకారంలో చక్రాలు ఉండడమేంటి.. అలా ఉంటే సైకిల్ ఎలా ముందుకు కదులుతుంది.. ఒకవేళ అలాంటి సైకిల్ తయారు చేసిన దాన్ని నడపడం మాత్రం అసాధ్యం అంటారు అందరూ. కానీ ఇక్కడ ఒక ఇంజనీర్ మాత్రం చతురస్రాకాలంలో సైకిల్ వీల్స్ తయారు చేశాడు. ఇక దానిమీద ముందుకు దూసుకుపోతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.



 సెర్గి గోర్డియేవ్ అనే ఇంజనీర్ నార్మల్ గా ఉండే సైకిల్ చక్రాల ఆకారంలో కాకుండా చతురస్రాకారంలో ఉండే చక్రాలను సృష్టించాడు. ఇక చక్రాల ఆకారం మార్పుతో తెచ్చిన ఈ కొత్త సైకిల్ ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి. అయితే రెగ్యులర్ గా ఉండే రౌండ్ వీల్స్ కంటే ఇవి ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయని సదరు ఇంజనీర్ చెబుతూ ఉండటం గమనార్హం. ఒక వీల్స్ తప్ప మిగతా అంతా నార్మల్ సైకిల్ లాగానే ఉంది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారగా నేటిజన్స్ భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: