పిల్లి కుక్క అనేవి పుట్టుక తోనే జాతి వైరాన్ని కలిగి ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ రెండు పరస్పరం ఎప్పుడైనా ఎదురు పడ్డాయి అంటే చాలు ఒకదానిపై ఒకటి దారుణంగా దాడి చేసుకోవడం లాంటి ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో మాత్రం పిల్లి కుక్క అనేవి జాతి వైరం ఉన్న జంతువులు కాదు స్నేహభావం ఉన్న జంతువుల్లా మెలుగుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి తరహా వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ఉన్నాయి.



 నేటి రోజుల్లో ఎంతోమంది పిల్లి, కుక్కను పెంచుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. అయితే ఈ రెండిటిని కూడా ఒకే చోట పెంచుకుంటూ ఉండడంతో జాతి వైరాన్ని మరిచిపోయి మరి ఈ రెండు కలిసి మెలిసి ఉంటూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో పిల్లి, కుక్కకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. సాధారణంగా అయితే కుక్కను చూసి పిల్లి భయపడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఒక క్యూట్ కుక్కని పిల్లి భయపెట్టింది. ఎగబడి మరీ కొట్టేందుకు ప్రయత్నించింది.



 ఇక ఆ పిల్లిని చూసి ఆ కుక్క కూడా ఎంతగానో భయపడి పోయింది. ఆ తర్వాత ఒక చోట చేరి హాయిగా బెడ్ పై నిద్రపోయాయి. ఒకదానిపై ఒకటి చేయి వేసుకొని మరి హాయిగా నిద్రపోవడం ఈ వీడియోలో చూడవచ్చు.  ఇక ఈ వీడియో చూసి నేటిజన్స్ అందరు ఫీదా అవుతున్నారు. కల్మషం లేని స్నేహబంధం అంటే ఇదే అంటూ కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు. జాతి వైరమున్న జంతువులు ఇలా స్నేహితుల్లాగా మారిపోవడం గొప్ప విషయం అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: