
ఈ క్రమం లోనే ఇలాంటి వీడియోలు ఏవైనా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి అంటే చాలు ఇక అవి నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటాయని చెప్పాలి. ఒకవేళ ఇలా వీడియోల్లో విషపూరితమైన పాములు కనిపించాయి అంటే చాలు వాటి కదలికలు.. దాడి చేసే వేగం ఎలా ఉంది అని ఎంతోమందిఆసక్తిగా వీక్షిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఏకంగా 15 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా కు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా తెగ చక్కర్లు కొడుతుంది. ఏకంగా కారులో దూరిన భారీ కింగ్ కోబ్రాను ఒక స్నేక్ క్యాచర్ ఎంతో చాకచక్యంగా పట్టుకొని బంధించాడు.
ఇక ఆ తర్వాత ఆ కింగ్ కోబ్రా కి ఎలాంటి హాని కలిగించకుండా బ్యాగ్ పట్టుకుని వెళ్లి అడవిలో ఆ పామును వదిలేసాడు అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ వీడియోలో పామును చూస్తేనే గుండెలు హడలిపోతున్నాయి అని చెప్పాలి. ఇంత భారీ పామును అటు వీడియోలో చూస్తేనే భయమేస్తుంది.. అదే నేరుగా అయితే ఇక అటు నుంచి అటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అంటూ ఎంతో మంది నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్ వేయండి.