సాధారణ మనుషులతో పోల్చి చూస్తే మందుబాబుల తీరు కాస్త విచిత్రంగా ఉంటుంది . మందు బాబులకి సమయానికి ఆహారం దొరక్క పోయిన పర్వాలేదు. కానీ గొంతు మాత్రం మందు చుక్కతో తడవాల్సిందే. ఒకవేళ సమయానికి మందు దొరకలేదు అంటే ఇక పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు ఎంతోమంది. ఇక ఇలాంటివారిని ప్రతి ఒక్కరు కూడా వారి చుట్టుపక్కలు చూసే ఉంటారు. అంతేకాదు ఉదయం లేవగానే టీ కాఫీ తాగడం ఎలా అయితే అందరూ అలవాటు చేసుకుంటారో.. అలాగే మందుబాబులు ఉదయం లేవగానే ఒక పెగ్గు వేయడం అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఇక ఇలా మందు చుక్క గొంతులోకి వెళ్లలేదు అంటే వారి రోజువారి జీవితం నరకప్రాయంగా ప్రారంభమవుతూ ఉంటుంది. అయితే మనుషులే ఇలా ప్రవర్తిస్తే మద్యానికి ఒక మేక బానిసగా మారిపోతే దాని ప్రవర్తన ఎలా ఉంటుంది.



 ఇందుకు నిదర్శనంగా మారింది ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన. ఏకంగా యజమాని రోజు తాను మద్యం తాగుతున్న సమయంలో ఇక తాను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న మేకకు కూడా మద్యం పోయడం అలవాటు చేశాడు. అయితే ఇలా రోజు తాగుతూ తాగుతూ ఆ మేక కూడా మనుషుల్లాగానే మధ్యానికి బానిసగా మారిపోయింది. చివరికి మందుకు బానిసగా మారిన మేక ఎంతకు తెగించిందంటే ప్రేమగా పెంచుకుంటున్న యజమానికి పైకే తిరగబడింది. మద్యం పోయలేదు అన్న కోపంతో దారుణంగా దాడికి దిగింది.



 ఇలా ఒక వ్యక్తిపై మేక దారుణంగా దాడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ వీడియోలో ఏముందంటే ఇద్దరు వ్యక్తులు బయట కూర్చుని బీరు తాగుతూ ఉంటారు. ఇక బీర్ క్యాన్లు ఒక్కదాని తర్వాత మరొకటి లాగించేస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అంతలో అక్కడికి ఒక మేక వస్తుంది. బీర్ క్యాన్లు వాసన చూస్తుంది. తనకు కూడా బీర్ పోస్తారేమో అని ఆశగా చూస్తుంది. అయితే అక్కడున్న వ్యక్తులు మాత్రం ఆ మేకకు బీర్ పోయలేదు. దీంతో కోపంతో ఊగిపోయింది మేక. నాలుగు అడుగులు వెనక్కి వేసి పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్లి కొమ్ములతో దాడి చేసింది. ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: