బెంగళూరు సిటీలో మండుటెండల్లో కూడా వరదలు ఒక రేంజిలో వణికించాయి. ఈ ఆకస్మిక వర్షాలనేవి బెంగళూరు నగరాన్ని పూర్తిగా ముంచెత్తాయి. ఈ భారీ వర్షాలకు నగరమంతా కూడా జలమయమయ్యింది. ఇక పలుచోట్లు వరదనీటిలో కొట్టుకుపోతున్న జనాన్ని కాపాడడానికి భారీ సహాయక చర్యలని కూడా చేపట్టడం జరిగింది.కేఆర్‌ సర్కిల్‌లో వరదనీటిలో కొట్టుకుపోతున్న జనాన్ని సహాయక సిబ్బంది కాపాడటం జరిగింది. అండర్‌పాస్‌లో వరదనీరు బాగా చేరింది. ఇంకా సబ్‌వేలు కూడా నీట మునిగాయి. కార్లన్ని కూడా వరదనీటిలో కొట్టుకుపోయాయి. ఎలక్ట్రానిక్‌ సిటీ ఇంకా మేజెస్టిక్‌ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వర్షాలు, ఈదురు గాలులతో పలు ప్రాంతాల్లో చెట్లు కుప్పకూలడం జరిగింది.అలాగే చాలా కార్లు ధ్వసంమయ్యాయి.ఇంకా కేఆర్‌ సర్కిల్‌ ప్రాంతంలో సబ్‌వేలో కారు చిక్కుకుంది. ఆ కారులో ఉన్న ఆరుగురిని అతికష్టం మీద కాపాడటం జరిగింది.వారిని భారీ నిచ్చెన సాయంతో బయటకు తీసుకొచ్చారు. కారు నుంచి బయటకు తీసుకొచ్చిన వారిలో ఒకరి పరిస్థితి అయితే చాలా విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. 


ఇక ఆ కారులో ఉన్న వారిని ఏపీ కృష్ణా జిల్లా తేలప్రోలుకు చెందిన వారిగా గుర్తించారు.అయితే వీరంతా కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు విహారయాత్రకు వెళ్లారు.కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఆదివారం నాడు మధ్యాహ్నం ఈ భారీ వర్షం మొదలైంది. ఈ భారీ వర్షంతో చాలా ప్రాంతాలు కూడా నీటమునిగాయి. ఇంకా రోడ్లన్ని కూడా జలమయమయ్యాయి. ఇక బెంగళూరులో ఈ ఆకస్మిక వరదలపై సీఎం సిద్ధరామయ్య అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.ఇంకా మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నాడు రాత్రి కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇంకా రానున్న నాలుగు రోజుల పాటు బెంగళూరులోనే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు అలాగే మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని  కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: