ఇటీవల తాజాగా జరిగిన ఒక సర్వేలో మాత్రం అంత అవసరం లేదనే విషయం బయటకు వచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 0.06 శాతం మంది మాత్రమే ఆస్పత్రికి వెళ్లే అవసరం ఉంటుందని, టీకాలు తీసుకున్న వారు 97.38శాతం మంది వైరస్ నుంచి రక్షణ పొందారని "ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్" అధ్యయనం వెల్లడించింది.. కోవిడ్ 19 బ్రేక్ ఇన్ఫెక్షన్ ఫ్రీక్వెన్సీని అంచనా వేయడానికి ఆస్పత్రి వర్గాలు ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. అంటే వ్యాక్సిన్ తీసుకున్న మొదటి వంద రోజుల్లో ఈ అధ్యయనం చేశారు. అలా పరిశోధనలు జరిపిన తరువాత వ్యాక్సిన్ తీసుకున్నవారికి కరోనా వైరస్ సోకితే ఆస్పత్రికి వెళ్లే అవకాశం చాలా వరకు రాలేదని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అనుపమ్ సిబల్ ఈ విషయాలను వెల్లడించారు..