పామును చూస్తే ఎవరికైనా భయం కలుగుతుంది .. అది మనల్ని ఎక్కడ కాటేస్తుందో అని పాము కనబడగానే భయం తో పరుగులు తీస్తుంటాం .. అయితే ఎవరు  పాముతో పట్టుమని పది సెకన్లు కూడా గడపలేరు  .. కానీ నీలం కుమార్ ఖైర్ అనే వ్యక్తి  ఏకంగా విషసర్పాలతో  మూడురోజులు గడిపి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు ఈ ఘనత సాధించి   గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో కూడా ఎక్కాడు  .. అసలు  మూడు రోజులు విషసర్పాల మధ్య అతడు  ఎందుకు గడిపాడు దాని వెనకాల ఉన్న కారణం ఏమిటో  ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం ..


పుణెకు చెందిన నీలం కుమార్ ఖైర్ 28 ఏళ్ల వయస్సులోనే పాములతో  ప్రేమలో పడ్డాడు. అయితే ప్రజలు పాము కనబడగానే తమ పై ఎక్కడ  దాడి చేస్తాయో అనే భయంతో చంపేస్తుంటారు ..ప్రజలు వాటిని ఆలా చంపడం  నీలం కుమార్ ఖైర్ కు ఇష్టం ఉండేది కాదు  ..   దీంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నీలం కుమార్ ఖైర్ కంకణం కట్టుకున్నాడు. ఆలా విష సర్పాలతో నిండిన గాజు చాంబర్‌లో ఎలాంటి ఆయుధాలు లేకుండా ఒంటరిగా మూడు రోజులు గడిపాడు. మామలు మనుషులైతే ఇలాంటి  వాటికీ దూరంగా ఉంటారు కానీ నీలం కుమార్ ఖైర్ కు  పాములంటే ఇష్టం ఉండడంతో .. తానే స్వయంగా రంగంలోకి దిగాడు .. అకారణంగా చంపుతున్న పాముల పై అవగాహనా కల్పించడం కోసం తన వంతు బాధ్యతగా ఏదైనా చేయాలనీ ఈ పనికి శ్రీకారం చుట్టాడు ..  ఈ సందర్భంగా నీలం కుమార్ ఖైర్ ఛాంబర్ లోపల వెళ్లి కూర్చునే సమయంలో  పాములు అతడి మీదకు ఎక్కేవి. అయితే, నీలం కుమార్ ఖైర్ వాటిని ఎంతో జాగ్రత్తగా పట్టుకుని కిందపెట్టేవాడు. మూడు రోజులు ఆ గాజు ఛాంబర్లోనే ఉన్న నీలం కుమార్ ఖైర్ ను ఒక్క పాము కూడా కాటేయకపోవడం గమనార్హం.

ఇతడు చేసిన సాహసమైన పని  గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లో కూడా నమోదైంది. ఆ తర్వాత  అతడు పుణె మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో  కాట్రాజ్ స్నేక్ పార్క్‌ను నిర్మించాడు. ఇప్పుడు ఆ పార్క్‌.. రాజీవ్‌ గాంధీ జూలాజికల్ పార్క్‌గా అభివృద్ధి చేశారు. నీలం కుమార్ ఇప్పుడు జంతువుల అనాథ శరణాలయాన్ని కూడా మొదలుపెట్టాడు. చూశారుగా.. మీకు పాములు కనిపిస్తే వెంటనే చంపేయకండి. పాములను పట్టుకొనే వ్యక్తులకు సమాచారం ఇవ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి: