ఇప్పుడు దొంగలు అతి తెలివిని ప్రదర్శించి పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సరి కొత్త పద్దతిలో దొంగతనం చేస్తూ పోలీసులకు చెమటలు పట్టిస్తున్నారు. ఎలాంటి కరుడు కట్టిన దొంగల ను అయిన చాక చక్యంగా వ్యవహరించి పట్టుకుంటూన్నారు. వాళ్ళకు మించిన టెక్నాలజీ ని ఉపయొగించి  నేరగాళ్ల ఆట కట్టిపడేస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా జరిగిన ఒక ఘటన పోలీసుల పై ప్రసంసలు కురిపిస్తుంది. సినిమా లెవెల్ లో ఓ పోలీసు అధికారి చేజ్ చేసి దొంగను పట్టుకున్నారు..


ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ను షేక్ చేస్తున్నాయి. హీరో లెవెల్ లో పోలీసు  చేసిన సాహసం పై కామెంట్లు వెలు వెత్తుతున్నాయి. ఈ ఘటన జరిగి రెండు రోజులు అయ్యింది. ఇప్పుడు ఆ విషయం వైరల్ అవ్వడం విశేషం.. వివరాల్లొకి వెళితే.. ఈ అద్భుతం కర్ణాటక లో వెలుగు చూసింది. కర్ణాటక రాష్ట్రం లోని మంగుళూరు లో ఒక వలస కూలీ విశ్రాంతి తీసుకుంటుండగా.. అతని ఫోన్ కొట్టేసాడో దొంగ. దీంతో సదరు బాధితుడు దొంగా అని అతణ్ణి వెంబడించాడు. అది గమనించిన పోలీస్ దొంగ వెనుక పరుగు పెట్టాడు.


దొంగను గ్యాప్ లేకుండా పులి పంజా విసిరి.. సందులు గొందులు పరిగెత్తించి మరి పట్టుకున్నారు. దొంగతనం జరిగినప్పుడు వలసకూలీ నెహ్రూ గ్రౌండ్స్ లో నిద్రపోతున్నాడ ని పోలీసులు తెలిపారు.. అక్కడ పట్ట పగలే దొంగతనాలు జరుగుతున్నాయి. పోలీసు చేసిన సాహసం జనాల్లొ కొత్త ధైర్యాన్ని నింపింది. ఆ దొంగను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అతణ్ణి విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. అతను సెల్ ఫొన్ దొంగ అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆ పోలీసు రియల్ హీరో అయ్యాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.. మీరు ఒకసారి చూడండి...
మరింత సమాచారం తెలుసుకోండి: