ఇటీవల కాలంలో ఎన్నో రకాల విషయ సర్పాలు అటు జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా ఒక కుటుంబం ఉంటున్న ఇంట్లోకి ఒకవేళ నాగు పాము వచ్చిందంటే దాన్ని చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది ఏకంగా కర్ర సహాయంతో పామును కొట్టి చంపడం లాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది ఏకంగా పాములపై కూడా జాలి చూపించి వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించి వారి సహాయంతో సురక్షితంగా వాటిని పట్టుకుంటారు.


 ఇలా ఇప్పుడు వరకు ఇంట్లోకి పాము వచ్చిన సమయంలో పామును చంపడం లేదా స్నేక్ క్యాచర్  సహాయంతో పామును పట్టుకోవడం చేయడం లాంటివి చూశాము.  కానీ ఇక్కడ కుటుంబ సభ్యులు మాత్రం ఇంట్లోకి నాగుపాము దూరిన సమయంలో వ్యవహరించిన తీరు హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా నాగు పాముకు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఒక కర్రతో పాము తలను అదిమిపెట్టి.. పాలు పసుపు కుంకుమ చల్లి పూజలు చేశారు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వెలుగు చూసింది.


 అమలాపురంలో విత్తనాల వారి కాలువ గట్టు వద్ద ఉన్న ఒక ఇంట్లోకి ఏకంగా తాచుపాము చొరబడింది. ఆ పామును గమనించిన కుటుంబ సభ్యులు ఎక్కడ భయపడలేదు. ఏకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చాడు అంటూ మురిసిపోయారు. పాము కాటు వేస్తుంది అని భయపడకుండా భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. షష్టి రోజున పాము ఇంట్లోకి రావడంతో దేవుడే స్వయంగా మా ఇంట్లో అడుగు పెట్టాడు అంటూ ఏకంగా ప్రత్యేక పూజలు చేశారు. స్నేక్ క్యాచర్కు సమాచారం అందించగా.. అతను వచ్చి పామును పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలోనే ఇంట్లో ఉన్న మహిళలు పాలు పసుపు కుంకుమ చలి పూజలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: