సాదరణంగా బస్సులతో పోల్చి చూస్తే అటు రైలు ప్రయాణం అతి తక్కువ ఖర్చుతో సౌకర్యవంతంగా కూడా ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సుదూర ప్రాంతాలకు వెళ్లాలి అనుకునేవారు ఇక బస్సులు ద్వారా కాకుండా రైలు ద్వారా ప్రయాణించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఏకంగా ఇక్కడ మాత్రం లగ్జరీ బస్సుతో పోల్చి చూస్తే రైలు ప్రయాణం చేయాలనుకునే టికెట్ ఎక్కువగా ఉంది అని చెప్పాలి. ఏకంగా ఒక్క టికెట్ ధర లక్షల రూపాయలు ఉండడం ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉందని చెప్పాలి. ఇక విమాన ప్రయాణం కంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.


 ఇంతకీ ఈ రైలు టికెట్ ధర ఎంతో తెలుసా.. అక్షరాలా 19 లక్షల రూపాయలు. ఏంటి రైలు టికెట్ 19 లక్షల.. అదేమైనా విమానమా అంత టికెట్ ధర ఉండడానికి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా.. ఈ టికెట్ ధర నిజంగానే ఉంది.  అది కూడా ఎక్కడో కాదు మన ఇండియాలోనే. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ద్వారా నిర్వహించబడుతున్న మహారాజాస్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు లగ్జరీ రైలు ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది అని చెప్పాలి.


 లగ్జరీ అంటే కనీసం ఊహకు అందని రీతిలో ఉంటుంది అని చెప్పాలి. ఏదో ఓ చిన్న లగ్జరీ విల్లా లాంటి భోగి ఉంటుంది అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే 19 లక్షల రూపాయల విలువైన టికెట్ ధరకు తగ్గట్లుగానే ఇక మహారాజాస్ ఎక్స్ ప్రెస్ ప్రయాణం కూడా ఉంటుంది అని చెప్పాలి. ఇక ఈ టికెట్ ధరకు తగ్గట్లే అందులో ఉన్న పూర్తి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఒక కోచ్ ను లగ్జరీ విల్లాలాగా తీర్చిదిద్దారు. దీంట్లో నిద్ర వస్తే పడుకోవడానికి రెండు బెడ్ రూమ్లు. ఒక లివింగ్ రూమ్. ఏ క్లాస్ వాష్ రూమ్ తో పాటు అన్ని లగ్జరీ గానే ఉంటాయి. టీవీ, డివిడి ప్లేయర్, వైఫై, ఇంటర్నెట్ ఇలా చెప్పుకుంటూ పోతే.. ఏది కావాలన్నా ఈ విల్లాలోనే దొరికేస్తుంది. ఈ విల్లాకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: