సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడో ప్రపంచ నలుమూలల్లో  జరిగిన ఘటనలు కూడా కేవలం నిమిషాల వ్యవధిలో తెలుసుకోగలుగుతున్నాడు మనిషి.. అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే అన్ని విషయాలపై కూడా అవగాహన పెంచుకోగలుగుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉన్నాయ్. ముఖ్యంగా కొన్ని వీడియోలు అయితే ఇంటర్నెట్ ని షేక్ చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది.


 ఇటీవల కాలంలో ఎంతోమంది జీవితాలను క్యాన్సర్ అనేది తలకిందులుగా మార్చేస్తుంది అన్న విషయం తెలిసిందే. హాయిగా సాగిపోతున్న జీవితాన్ని ఉపద్రవంలా దూసుకు వస్తున్న క్యాన్సర్ చివరికి ప్రాణాలు పోయే పరిస్థితిని తీసుకువస్తుంది. ఎంతటి వారినైనా కుంగదీస్తూ చివరికి జీవితం భారం అయ్యేలా చేస్తుంది అని చెప్పాలి. ఇటీవల ఒక యువతి క్యాన్సర్ బారిన పడగా.. ఏకంగా క్యాన్సర్ ను జయించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే  గుండు చేయించుకోవడానికి కటింగ్ షాప్ కు వెళ్ళింది. అయితే ఎంతో ఇష్టంగా పెంచుకున్న జుట్టును తీసేస్తూ ఉంటే  ఆమె కన్నీరు పెట్టుకుంది. గుండు గీసిన తర్వాత తన ముఖాన్ని తాను అద్దంలో చూసుకోలేకపోయింది.


 అయితే ఆమెకు గుండు గీస్తున్న క్షవురకుడు సైతం తీవ్ర భావోద్వేగానికి గురి కావడం గమనార్హం. గుండు గీస్తున్న సమయంలో ఆమెను పట్టుకొని కన్నీరు పెట్టుకున్నాడు. అయితే ఇక సదరు యువతికి గుండు గీసిన తర్వాత బాధతో తాను కూడా గుండు కొట్టుకునేందుకు సిద్ధమయ్యాడు సదరు వ్యక్తి. ఈ వీడియో ట్విటర్లో వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన నెటిజన్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ యువతి బాధను చూసి గుండు గీసిన వ్యక్తికి  ఎంత బాధ వేసిందో ఏమో అందుకనే చివరికి తాను కూడా గుండు కొట్టుకొని ఆమెలో ధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నించాడు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: