విమానాల్లో జరుగుతున్న కొన్ని సంఘటనలు ఈమధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి ప్రజలను కలవరపెడుతూ ఇంకా ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నాయి.ఈమధ్య కాలంలో విమానాల్లో  ప్రయాణికుల చెడు ప్రవర్తన శ్రుతి మించుతుంది. తాజాగా అలాంటి మరో ఘటన ఇక్కడ జరిగింది. సాధారణంగా మనం..కిటికీ పక్క సీటు కోసం ప్రయాణికులు రైళ్లు, బస్సుల్లో తిట్టుకోవడం ఇంకా అలాగే కొట్టుకోవడం కూడా చూసే ఉంటాం. అయితే ఇప్పుడు విండో సీటు కోసం ఏకంగా విమానంలోనే ప్రయాణికులు చాలా దారుణంగా కొట్టుకున్నారు. ఫలితంగా రెండు గంటలపాటు ఆ విమానం ఆగిపోయింది. ఈ చెత్త ఘటన బ్రెజిల్‌లోని గోల్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను మైక్ సింగ్‌టన్ అనే నెటిజన్ తన ట్విటర్ అకౌంట్ లో షేర్ చేయగా ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.స్థానిక మీడియా కథనం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే.. గోల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సాల్వడార్-కాంగోన్‌హాస్ విమానం లో రెండు కుటుంబాలకు చెందిన 15 మంది వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. 


ఫ్లైట్‌ బయలుదేరడానికి కొన్ని క్షణాల ముందు ఒక మహిళా ప్రయాణికురాలు దివ్యాంగుడైన తన కుమారుడి కోసం విండో సీటుని అడగగా ఆ సీటులో కూర్చున్న ఆ ప్రయాణికుడు నిరాకరించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ మహిళ..విండో సీటులో కూర్చున్న వ్యక్తిని  తిట్టింది. ప్రయాణికుడి కుటుంబంపై బాగా విరుచుకుపడింది. దీంతో ఇరువురి కుటుంబాల మధ్య మాటల యుద్ధం మొదలై అది చివరకు పెద్ద ఘర్షణకు దారితీసింది. రెండు గ్రూపులుగా విడిపోయిన రెండు కుటుంబాలకు చెందిన 15 మంది విమానంలోనే చాలా దారుణంగా కొట్టుకున్నారు. అయితే వీరిలో ఎక్కువమంది మహిళలే కావడం గమనార్హం. విమానం మధ్య వరుసలో మహిళలు ఒకరిపై ఒకరు అరుస్తూ చాలా దారుణంగా దాడులు చేసుకుంటూ అరాచకం సృష్టించారు. ఆ వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది, విమాన కెప్టెన్ జోక్యం చేసుకుని వారించే ప్రయత్నం కూడా చేశారు. తాను దాదాపు విమానం తలుపులు మూసివేయబోతున్న సమయంలో ఇలా గొడవ జరిగిందని విమాన సిబ్బంది ఒకరు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: