
అడవుల్లో ఉండే జంతువులకు సంబంధించిన వీడియోలను చూడడానికి నెటిజన్స్ అందరూ ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు ఎంతో మంది టూరిస్టులు ఇటీవల కాలంలో సఫారీల్లోకి వెళ్లి ఇక జంతువులను ఎంతో దగ్గరగా వీడియో తీయడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఒక చిరుత పులి, ఉడుముకు సంబంధించిన వీడియో ఇలాంటిదే ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. సాధారణంగా చిరుత పులి ఒక జంతువును వేటాడాలి అనుకున్నప్పుడు ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
చిరుత వేగం ముందు ఎంతటి జంతువు అయినా సరే తలవంచాల్సిందే. కానీ ఇక్కడ ఒక చిన్న ఉడుము ఏకంగా చిరుతకే షాక్ ఇచ్చింది. నా దగ్గరికి వచ్చి.. నన్ను వేటాడాలని ప్రయత్నిస్తావా అంటూ చిరుత చెంప పగలగొట్టింది. ఈ వీడియో ట్విటర్లో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. రోడ్డు దాటుతున్న ఉడుముని ఆహారంగా మార్చుకోవాలని చిరుత ప్రయత్నించింది. ఇక ఉడుము దగ్గరగా వచ్చిన చిరుతను గమనించి తోకతో ఒక్కసారిగా చెంప చెల్లుమనిపించింది. దీంతో చిరుత మైండ్ బ్లాక్ అయింది. ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఈ వీడియో చూసి ఎంతోమంది నవ్వుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్కేయండి.