దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేస్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది . నవ వధువు తన భర్తని అతి కిరాతకంగా దారుణాతి దారుణంగా చంపేసింది . సేమ్ టు సేమ్ డిట్టో అలాంటి తరహా ఘటన ఇప్పుడు తెలంగాణలో జరిగింది . దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రం ఉలిక్కిపడింది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది . "నువ్వంటే నాకిష్టం అంటూ కన్నీరు పెట్టుకొని మరీ ఓ యువకుడిని నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకున్న ఒక యువతి పెళ్లయిన నెల రోజులకే భర్తను దారుణాతి దారుణంగా హత్య చేయించింది . దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రం ఉలిక్కిపడింది. పెళ్ళికి ముందు ఒక బ్యాంకు ఉద్యోగితో సంబంధం ఉంది అని ఈ హత్యకు అదే కారణం అంటూ కూడా తెలుస్తుంది". అంతే కాదు సదురు బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇచ్చి మరి ఆ అబ్బాయిని చంపించేశారు అంటూ బయటపడింది . పూర్తి వివరాల్లోకెళ్తే...


గద్వాల్ కు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేస్వర్ కు కర్నూలు జిల్లా కేంద్రంలోని కర్నూల్ ఎస్టేట్ కు చెందిన ఐశ్వర్య కు పెళ్లి జరిగింది.  ఈ ఏడాది ఫిబ్రవరి 13న వీళ్ళ పెళ్లి నిశ్చయమైంది . పెళ్ళికి ఐదు రోజులు ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది . ఇది సినిమా లెవెల్ లో ఊహించిన ట్విస్ట్ గా మార్చేశారు. కర్నూల్లోని ఓ ప్రముఖ బ్యాంకుకు చెందిన ఉద్యోగితో ఆమెకు ఆల్రెడీ సంబంధం ఉంది అని టాక్ . ఐశ్వర్య అతని వద్దకే వెళ్లిపోయిందని అంతా భావించారు . అయితే సడన్గా ఎవరు ఊహించిన విధంగా ఫిబ్రవరి 16 తిరిగి వచ్చింది . తేజ తో ఫోన్లో మాట్లాడింది . తాను ఎవరితోనూ ప్రేమలో లేనని కట్నం ఇవ్వడానికి అమ్మ పడుతున్న ఇబ్బంది చూసి తట్టుకోలేకపోయాను అని హైడ్రామా చేస్తూ స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది .


పిచ్చి ప్రేమతో కళ్ళు మూసుకుపోయిన తేజ అదంతా నమ్మేశాడు . నువ్వంటే నాకిష్టం అని ఏడవగానే మెల్ట్ అయిపోయాడు . తల్లిదండ్రులను ఒప్పించి మే 18 ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు.  అయితే ఐశ్వర్య నిత్యం ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతో పెళ్లయిన రెండో రోజు నుంచే మనస్పర్ధలు మొదలయ్యాయి.  ఈ క్రమంలోనే జూన్ 17న తేజేశ్వర్ అదృశ్యం అవ్వగా ఆదివారం ఉదయం ఏపీలోని పాణ్యం సమీపంలో శవమై తేలాడు.  ఆయన మృతదేహం పోలీసులకు దొరికింది . దీంతో తేజేశ్బర్ కుటుంబ సభ్యులు ఐశ్వర్య పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు . ఐశ్వర్య ఆమె తల్లి నే తన బిడ్డని చంపేసారు అని ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారు . ఆమె తల్లి సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా విస్తపోయే విషయాలు బయటకు వచ్చాయి .


ఆల్రెడీ ఐశ్వర్య కి ఓ బ్యాంకు ఉద్యోగిత సంబంధం ఉంది అంటూ బయటపడింది . నెల రోజుల్లో భర్తకు 150 సార్లు కాల్ చేస్తే సదరు ఉద్యోగితో మాత్రం  2000 సార్లు పైగానే మాట్లాడినట్టు ఫోన్ కాల్ లో బయటపడింది . అంతేకాదు పక్కా స్కెచ్ తోనే ఆ బ్యాంకు ఉద్యోగి ఐశ్వర్య భర్తను లేపేశారు.  కొంతమంది జూన్ 17న ఆయన ను కలిశారు . 10 ఎకరాల పొలం కొంటున్నామని సర్వే చేయాలని చెప్పి గద్వాల్ లో కారు ఎక్కించుకొని మరి తీసుకెళ్లారు . అక్కడే కత్తులతో దాడి చేసి గొంతు కోసి చంపేశారు.  మృతదేహాన్ని పాణ్యం  సమీపంలోని సుగాలి మెట్టులో పడేశారు . హత్యకు ఐశ్వర్య తల్లి సుజాత కూడా సహకరించడం హైలైట్ . ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంకు ఉద్యోగి ప్రెసెంట్ పరారీలో ఉన్నాడు . కాగా  ఐశ్వర్య - సుజాతను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఉద్యోగ కోసం పోలీసులు తీవ్రంగా సెర్చ్ చేస్తున్నారు. మేఘాలయ తరహాలోనే ఈ ఘటన కూడా ఉండడం అందరికీ షాకింగ్ గా ఉంది . పెళ్లి ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చుగా అంటూ కొంతమంది సజెషన్స్ ఇస్తున్నారు . ఇలా పెళ్లి చేసుకొని ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం కరెక్టేనా అంటూ ఇలాంటివారిని ఊరికే వదలకూడదు కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: