ప్రస్తుతం భారతదేశం టెక్నాలజీలో  దూసుకుపోతోంది. ఇతర దేశాలతో పోటీపడుతూ మరీ విజయాలు సాధిస్తుంది. ఇప్పటికే అంతరిక్షంలోకి  మనుషులు వెళ్లి అక్కడ పరిశోధనలు చేసి వస్తూ మంచి మంచి ప్రయోగాలు  చేసి సక్సెస్ అవుతున్నారు. ఇంత చేసినా కానీ  ఇంకా కులాలు, మతాలు అనే పిచ్చి మాత్రం జనాల్లో తగ్గడం లేదు. ఇంకా చాలా ప్రాంతాల్లో కులమతాలకు కట్టుబడి రాజకీయం, ఆర్థికంగా, ఉద్యోగ పరంగా కూడా  ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. మరి తెలంగాణలో కూడా ఆ ప్రాంతంలో కుల పిచ్చితో  ఒకే కాలనీకి ఐదు సూచిక బోర్డులు పెట్టారు. మరి ఆ కాలనీ ఎక్కడుంది అనే వివరాలు చూద్దాం.. తెలంగాణ రాష్ట్రంలోని మాజీ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ అంటే తెలియని వారు ఉండరు.. 

ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిన ఈ ప్రాంతంలో ఒక అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.. గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సమీపంలో ఉన్న మూట్రాజుపల్లి రోడ్డు పక్కన 25  ఇల్లు ఉన్నాయి. ఇంతకు ముందు ఈ కాలనీ పేరు అందరూ కలిసి వినాయక నగర్ అని నామకరణం చేశారు. అయితే ఇక్కడ అందరూ కలిసి ఏ పని చేసినా కలిసికట్టుగా చేసుకుంటారు. పోను పోను వీరి మధ్య ఐక్యమత్యం సన్నగిల్లింది.. దీంతో కాలనీ పేర్లు మారిపోయాయి. ఈ కాలనీలో మా కులం వారే ఎక్కువమంది ఉన్నారని ఒకరంటే, మా కులం వారే ఎక్కువ మంది ఉన్నారని మరొకరు, ఇలా వారి మధ్య వారికే విపరీతమైనటువంటి గొడవలు అయ్యాయి. దీంతో 70 శాతం మంది ఒక సామాజిక వర్గానికి చెందిన వారు ఉండడంతో, ఆ కాలనీ పేరు  మార్చేశారు.

అది నచ్చని 30% మంది వ్యక్తులు ఆ బోర్డుల పక్కనే, మీ కులం పేరు ఎందుకు పెడతారు,  మేము కూడా ఉన్నాం కదా అంటూ  వాళ్లు వారి వారి కులాల పేరుతో బోర్డులు కూడా పెట్టుకున్నారు. వినాయక నగర్ పక్కనే ఆర్యవైశ్య ఎన్ క్లెవ్, రెడ్డి ఎన్ క్లెవ్, ముదిరాజ్ ఎన్ క్లెవ్, విశ్వకర్మ ఎన్ క్లెవ్ ఇలా ఐదు రకాల బోర్డులు పెట్టారు..ఈ ప్రాంతానికి ఎవరైనా కొత్త వాళ్లు వస్తే అసలు ఈ కాలనీ పేరు ఏం  చెప్పాలో తెలియక పరేషాన్ అవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కుల పిచ్చికి కేరాఫ్ అడ్రస్ ఇదే అంటూ నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: