ఈ సీజన్‌లో ఉసిరికాయ ఎక్కువగా లభిస్తుందని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే దీన్ని చాలా మంది ప్రస్తుతం అనేక ర‌కాలుగా తీసుకుంటూ ఉంటారు. వంటల్లో, పచ్చడి రూపంలో, జ్యూస్ రూపంలో తీసుకుంటారు. దీంతో మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా నిత్యం ఉదయాన్నే పరగడుపున ఉసిరి కాయ జ్యూస్‌ను 30 ఎంఎల్ మోతాదులో తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


1. రోజూ పరగడుపున ఉసిరికాయ జ్యూస్‌ను తాగితే దాంతో శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. శరీర మెటబాలిజం ప్రక్రియను ఉసిరికాయ జ్యూస్ వేగవంతం చేస్తుంది. దీంతో క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. ఫలితంగా బరువు తగ్గుతారు.

2. ఉసిరికాయలో చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో ఈ సీజన్‌లో వచ్చే దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం వంటి సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. జ్వరం త్వరగా తగ్గుతుంది. ఆస్తమా ఉన్నవారు ఉసిరి జ్యూస్ తాగితే మంచిది. అంతేకాకుండా బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లు రావు. శరీరంలో ఉన్న విష పదార్థాలు బయటికి వెళ్లిపోయి శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. అంతేకాక ఉసిరితో మ‌రిన్ని వెరైటీ వంట‌లు కూడా చేసుకోవ‌చ్చు అవేంటంటే... ఉసిరిప‌చ్చ‌డి, ఉసిరి స్వీట్‌, ఉసిరి ర‌సం, ఉసిరి పెరుగు చారు ఇప్పుడు మ‌నం ఉసిరిపెరుగుచారు తెలుసుకుందాం...

ఉసిరి పెరుగు చారు

కావలసిన పదార్థాలు : పెరుగు - ఒకటిన్నర కప్పులు, ఉప్పు - రుచికోసం, ఉసిరికాయల తరుగు - పావు కప్పు, పచ్చిమిర్చి - 2, పచ్చికొబ్బరి కోరు - పావు కప్పు, నెయ్యి - ఒక టీ స్పూను, ఇంగువ - అర టీ స్పూను, మినప్పప్పు - అర టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, ఎండు మిర్చి - ఒకటి, కరివేపాకు - 4 రెబ్బలు.

          తయారుచేసే విధానం : ఉసిరికాయల తరుగు, పచ్చిమిర్చి, పచ్చికొబ్బరి కోరు కలిపి 2 టేబుల్‌ స్పూన్ల నీటితో పేస్టు చేసుకోవాలి. ఒక పాత్రలో పెరుగు, ఉప్పు, ఉసిరి పేస్టు వేసి తగినంత నీరు కలిపి బాగా చిలకాలి. ఇప్పుడు కడాయిలో నెయ్యి వేసి ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకుతో తాలింపు వేసి పెరుగు మిశ్రమంలో కలపాలి. ఈ చారు వేడి వేడి అన్నంలో కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: