కావలసిన పధార్థాలు :  బీట్ రూట్ : ¼ కిలో పంచదార : ¼కిలో నెయ్యి : ¼కప్పు మీగడ : 1 కప్పు  పాలు : ¼ లీటరు కిస్ మిస్ : కొంచెం జీడిపప్పు, బాదంపప్పు : తగినన్ని యాలకులపొడి : అర చెంచా తయారుచేయ చేయు విధానం : బీట్ రూట్ చెక్కుతీసి సన్నగా తురిమి, బాండీలో రెండు చెంచాలు నెయ్యి వేసి తురుమును వేయించి నీరు పోయిన తరువాత పాలు, తురుము కలిపి కుక్కర్ లో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. తరువాత మళ్లీ పాలలో వేసి పూర్తిగా ఇగిరిపోయేలా ఉడికించాలి. గరిటితో త్రిప్పుతూ పంచదార, మీగడ వేసి నెయ్యి కూడా వేయాలి. బాగా వేగి నెయ్యి పైకి తేరిన తరువాత యాలకుల పొడి కూడా కలిపి డిష్ లోకి తీసి దానిపైన కిస్ మిస్, బాదంపప్పు, అలంకరించి సర్వ్ చేస్తే చాా రుచిగా ఉంటుంది. వేడి వేడిది తింటే రుచి మరీ పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: