ఆడవాళ్లు అందంగా కనిపించాడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మనం  ఎన్ని రకాల క్రీములు వాడినగాని చర్మం ఆరోగ్యంగా ఉన్నప్పుడే అందంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అందుకే చర్మాన్ని క్లెన్సింగ్, మాయిశ్చరైజ్, టోనింగ్ చేసుకోవడం అనేవి.. మన స్కిన్ కేర్ రొటీన్‌లో భాగంగా ఉంటాయి. అయితే ఇలా చర్మాన్ని కాపాడుకోవడానికి అన్ని రకాల క్రీమ్స్ ను  ఉపయోగించడం వరకు బాగానే ఉన్నా.. అవి  అసలు మన చర్మానికి నప్పుతాయా? లేదా? అనేదే ఒక్కసారి ఆలోచించాలిసిన ప్రశ్న. ఎందుకంటే మనలో చాలామంది చర్మతత్వానికి సరిపోయే ఉత్పత్తులను ఉపయోగించడం లేదు. ఏదిపడితే అది వాడేస్తున్నాము.. ఇంకా చెప్పాలంటే మార్కెట్లోకి ఏది కొత్తగా వస్తే అది వాడేస్తున్నాము. మనం  క్రిమ్ వాడినగాని అది  చర్మంలో ఆ సమయానికి  ప్రకాశవంతమైన మార్పు కనిపించినా.. అది తాత్కాలిక ఫలితమే అవుతోంది తప్పా శాశ్వతమైన మార్పు కాదు.  మరి చర్మం ఎప్పుడూ అందంగా, ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉండాలంటే ఏం చేయాలో తెలిసుకుందాం.. !!



ఆడవాళ్లు మేకప్ వేసుకోవడం వల్ల  చాలా అందంగా కనిపించవచ్చు. కానీ దానికోసం మనం ఉపయోగించే ఉత్పత్తుల వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బ తింటుంది. చర్మం సహజమైన మెరుపుని కోల్పోతుంది. అలాగని మేకప్ లేకుండా బయటకు వెళ్లలేం. కొన్ని రంగాల్లోని వారికి మేకప్ చాలా అవసరం కూడా. మరి చర్మం కోల్పోయిన మెరుపుని తిరిగి పొందడం ఎలానో కూడా తెలుసుకుందాం.. ! మేకప్ వల్ల మనం అందంగా కనిపిస్తాం. కానీ చర్మం ఆరోగ్యంగా లేనట్లయితే మేకప్ వేసుకొన్నా పెద్దగా ఫలితముండదు. అందుకే చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అవసరం. దానికోసం మార్కెట్లో దొరికే ఖరీదైన ఉత్పత్తులు కాకుండా.. చాలా చౌకగా లభించే కూరగాయలు, పండ్లు వంటివి ఉపయోగించి చర్మాన్ని పరిరక్షించుకోవచ్చు.  
సహజసిద్ధమైన ఉత్పత్తులను ఉపయోగించి మనం పాటించే చిట్కాలు లేదా వేసుకొనే ఫేస్ ప్యాక్‌ల వల్ల చర్మకణాలు జీవకళను సంతరించుకొంటాయి.



చర్మానికి మంచి పోషణ దొరుకుతుంది. ఫలితంగా చర్మం మెరిసిపోతుంది. చర్మ సంరక్షణ కోసం అన్నీ సహజమైన ఉత్పత్తులనే ఉపయోగిస్తాం. కాబట్టి రసాయనాల ప్రభావం పడుతుందని, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే భయం  మనకు ఉండదు. అలాగే సహజసిద్ధమైన చిట్కాలను  పాటించడం మాత్రమే కాదు..వీటిని ఇంట్లో  తయారు చేసుకోవడం సైతం సులభమే. ఇంట్లో ఉన్న పదార్థాలతో తక్కువ ఖర్చుతోనే వీటిని తయారుచేసుకొని చర్మానికి అప్లై చేసుకోవచ్చు.
హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం వల్ల చర్మం రిలాక్సవుతుంది. అలాగే కాంతివంతంగా మెరుస్తుంది. ఎటువంటి రసాయనాలు ఉండవు. కానీ మీరు రెగ్యులర్ గా చర్మానికి అప్లై చేస్తూ ఉంటే తప్పక ఫలితం ఉంటుంది.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: