ప్రతీ మహిళ గర్భ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే పుట్టే పిల్లలు అంత ఆరోగ్యంగా పుడతారు. ఈ విషయాన్ని కాబోయే తల్లులు గుర్తు పెట్టుకోవాలి. గర్భం దాల్చింది మొదలు.. కాన్పు అయ్యేంతవరకూ తల్లులకు ఒకటే ఆలోచన. అదే పుట్టేది ఆడా.. మగ.. అని అయితే, ఈ విషయంలోనూ ఓ అంశం ఉంది.

అయితే గర్భిణిగా ఉన్న సమయంలో అరటి పండు తినడం వలన చాల ప్రయోజనాలు. ఇక అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, ఇతర పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇవి హార్మోన్ల స్థితి మారడానికి దోహదం చేస్తాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. అయితే.. దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. కేవలం దీనివల్లే అబ్బాయి పుడతాడన్న విషయాన్ని మాత్రం పరిశోధకులు నిర్ధారించలేదు. అయితే, అరటిపండులో ఎన్నో అద్భుత పోషకాలు ఉన్నాయి. ఇవి గర్భ సమయంలో మహిళలకు మేలు చేస్తాయి. కాబట్టి ఆ సమయంలో అరటిపండ్లు హ్యాపీగా తినేసేయొచ్చు.

కడుపుతో ఉన్న టైమ్‌లో కుంకుమ పువ్వు తీసుకుంటే పుట్టే పిల్లలు మంచి రంగులో పుడతారని చెబుతారు. దీనిపై పరిశోధనలు జరిగాయి. అయితే ఇదే నిజమని నిర్ధారణ అయితే కాలేదు. కానీ, కుంకుమ పువ్వులోని ప్రత్యేక గుణాల వల్ల తల్లీబిడ్డ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అయితే, అది మోతాదులోనే తీసుకోవాలి. మంచిది కదా అని ఎక్కువ తీసుకోకూడదు. దీనివల్ల వేడి చేయడం లాంటి దుష్ప్రభావాలు ఉంటాయి. వీటిని గుర్తు పెట్టుకోవడం మంచిది.

డెలీవరి సమయంలో ఆడపిల్ల అల్ల అయితే త్వరగా డెలీవరీ అవుతుంది. మగపిల్లాడు అయితే నొప్పులు ఎక్కువగా వస్తాయి. అదే కడుపులో ఉన్నది ఆడపిల్ల అయితే త్వరగా బయటికి వస్తారు అని చెబుతారు. ఆడపిల్ల అయితే నొప్పులు తక్కువ వస్తాయి. మగపిల్లాడు అయితే ఎక్కువ నొప్పులు.. ఆడపిల్ల అయితే తక్కువ నొప్పులు అని ఎక్కడా ఆధారం లేదు. కాబట్టి వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: