గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకోవకోవాలి. ఇక తల్లి తీసుకునే ఆహారంపైనే బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. అయితే చాల మంది నెయ్యిని ఇష్టంగా తింటుంటారు. అయితే గర్భధారణ సమయంలో మహిళలు నెయ్యి తినడం వలన ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని చాల మంది మహిళలు నెయ్యికి దూరంగా ఉంటారు. అయితే గర్భధారణ సమయంలో మహిళలు నెయ్యి తినవొచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఇక నెయ్యి తినడం వలన ఆరోగ్యానికి మంచి అని అంటున్నారు.

అయితే నెయ్యిలో యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి అరుగుదలకి హెల్ప్ చేస్తాయి. ఇందులో ఉండే బ్యుటిరేట్ అనే ఒక ఫ్యాటీ ఆసిడ్ గట్ హెల్త్ ని ప్రమోట్ చేస్తుంది. నాలుగవ నెల నుండి, బేబీ పుట్టే వరకూ మీకు కనీసం మూడు వందల క్యాలరీలు ఎక్కువ కావాలి. అప్పుడే బేబీ డెవలప్మెంట్ బావుంటుంది. నెయ్యి బేబీ గ్రోత్ కీ బ్రెయిన్ డెవల్ప్మెంట్ కీ హెల్ప్ చేస్తుంది. నెయ్యి ఒత్తిడిని తగ్గించి మంచి మూడ్ ఇస్తుంది. బాడీ నరిష్మెంట్ కి నెయ్యి నాచురల్ గా సహాయ పడుతుంది. నెయ్యి బాడీని స్ట్రాంగ్ గా, వార్మ్ గా ఉంచుతుంది.

అంతేకాక నెయ్యి రోజుకి రెండు మూడు టీ స్పూన్స్ వరకు తీసుకుంటే ఏ హానీ లేదు. కానీ అంత కంటే ఎక్కువ అయితే మాత్రం తల్లీ, బిడ్డా కూడా బరువు పెరుగుతారు. ప్రెగ్నెన్సీ చివరి వారాల్లో ఫిజికల్ యాక్టివిటీ కూడా బాగా తగ్గుతుంది. అన్నీ కలిపి నార్మల్ డెలివరీ ని డిఫికల్ట్ చేయవచ్చు. నెయ్యి ఎక్కువ తీసుకుంటే డెలివరీ తరువాత మామూలు బరువు కి రావడం కొంచెం కష్టమౌతుందని తెలిపారు.

ఇక ఆయుర్వేదంలో నెయ్యికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. స్వచ్చమైన ఆవు నేతిని కాచిన పాలలో కలిపి, అందులోనే ఒకట్ రెండు చుక్కలు కుంకుమ పువ్వు, మూడు నాలుగు చుక్కలు తేనె, చిటికెడు పసుపు కలిపి తీసుకుంటే ఇమ్యూనీటీని బూస్ట్ చేసి, బేబీ యొక్క బ్రెయిన్ హెల్త్ ని ప్రమోట్ చేసి, సేఫ్ డెలివరీకి సాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: