ఆడి తన కొత్త కారు క్యూ8 ఎస్ యూవీని ఈ నెల 27వ తారీఖున మార్కెట్ లో రిలీజ్ చేయనుంది. కారుకు సంబంధించిన ప్రత్యేకతలు కారు ప్రియులను ఆకర్షించే విధంగా ఉన్నాయి. కొత్త లుక్, ప్రత్యేక ఆకర్షణ, అత్యాధునికతను జోడించింది ఆడి సంస్థ. ఆడి ఆర్ఎస్ క్యూ8 ఎస్ యూవీకి సంబంధించి కంపెనీ తన డీలర్ షిప్ లేదా కంపెనీ అధికారిక వెబ్ సైట్ ద్వారా కారును బుక్ చేసుకోవచ్చు. దీని కోసం ముందస్తుగా రూ.15 లక్షలతో బుక్ చేసుకోవాలి. కారుకు సంబంధించిన సంస్థ ఇటీవల టీజర్ ను కూడా విడుదల చేసింది.
2019లో లాస్ ఏంజిల్స్ నగరంలోని ఆటో షోలో ఆడి ఆర్ఎస్ క్యూ 8 కారును ప్రదర్శించింది. ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన కార్లలో ఎస్ యూవీ నిలిచింది. ఈ కారుని మాడిఫై చేసి అత్యాధునికతను జోడించి ఆడి ఆర్ఎస్ క్యూ8ను మార్కెట్ లో రిలీజ్ చేయనుంది. ఆడి ఆర్ఎస్ క్యూ8 ఎస్ యూవీలో 4.0 లీటర్ సామర్థ్యం కలిగిన ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ ను జోడించారు. ఈ ఇంజిన్ 600 బీహెచ్ పీ శక్తిని, 800 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తిని చేస్తుంది. దీంతో పాటుగా ఈ కారులో 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ లను ఏర్పాటు చేసింది.
ఆడి తన సిగ్నేచర్ క్వాట్రో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టంను ఉపయోగించింది. కేవలం 3.8 సెకన్లలో 100 కిలో మీటర్ల వేగాన్ని పుంజుకునే శక్తి సామర్థ్యాలు ఏర్పాటు చేశారు. ఈ కారు యొక్క వెలుపలి భాగాన్ని రెగ్యూలర్ మోడల్ నుంచి వేరుగా ఉండేలా కంపెనీ ఇందులో కొన్ని మార్పులు చేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి