ఇక ప్రస్తుత కాలంలో చాలా మంది కూడా జుట్టు రాలే  సమస్యతో బాధపడుతున్నారు.అసలు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ కూడా ఈ సమస్య బారిన పబుతున్నారు. జుట్టు రాలడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి, ఆందోళన ఇంకా అలాగే రసాయనాలు ఎక్కువగా ఉండే షాంపులను వాడడం, చుండ్రు ఇంకా ఇతర అనారోగ్య సమస్యల కారణంగా జుట్టు చాలా ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది.జుట్టు రాలడాన్ని తగ్గించే అద్భుతమైన చిట్కా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఇందుకు ఉల్లిపాయను, కలబంద గుజ్జును ఇంకా కొబ్బరి నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా పెద్ద ఉల్లిపాయను తీసుకుని దానిని ముక్కలుగా చేసుకోవాలి.ఆ తరువాత దానిని జార్ లో వేసి వాటిని మెత్తగా పేస్ట్ గా చేసుకోవాలి. తరువాత దీనిని వస్త్రంలో లేదా జల్లిగంటెలో వేసి ఆ రసాన్ని మీరు తీసుకోవాలి. ఇంకా ఈ ఉల్లిపాయ రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని దానికి సమానంగా కలబంద గుజ్జును వేసి బాగా కలపాలి.


తరువాత ఈ రెండింటికి సమానంగా కొబ్బరి నూనెను వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి బాగా పట్టించాలి.ఆ తరువాత ఈ నూనె కుదుళ్లల్లోకి ఇంకేలా అలాగే బాగా మర్దనా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గంట పాటు అలాగే జుట్టుకు ఉంచుకుని తరువాత మీరు తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు నుండి మూడుసార్లు ఈ టిప్ పాటించడం వల్ల జుట్టు రాలడం సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు. ఇంకా అలాగే రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు కూడా చాలా త్వరగా వస్తుంది. ఈ టిప్ వాడడం వల్ల జుట్టు కుదుళ్లకు కావాల్సిన పోషకాలు కూడా చక్కగా అంది జుట్టు రాలడం తగ్గుతుంది. ఇంకా అంతేకాకుండా ఈ టిప్ వాడడం వల్ల జుట్టు నల్లగా ఇంకా అలాగే కాంతివంతంగా తయారవుతుంది. మార్కెట్ లో దొరికే షాంపులను ఇంకా నూనెలను వాడడానికి బదులుగా ఇలా ఇంట్లోనే ఈ టిప్ ని ఉపయోగించి మనం చాలా సులభంగా జుట్టు రాలే సమస్యని తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: