దురద, దద్దుర్లు కారణంగా చర్మ సంరక్షణ అనేది అసలు మరింత సవాలుగా మారుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి సమస్యలను నెగ్లెట్ చేయడం వల్ల భవిష్యత్‌లో ఖచ్చితంగా చాలా తీవ్ర సమస్యలు వస్తాయి.కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు కొన్ని హోమ్ రెమెడీస్ ని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మరి ఆ టిప్స్ ఏంటి వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంకా క్రిమినాశక లక్షణాలు ఉంటాయి. అందువల్ల చర్మపు దద్దుర్లు చాలా సులభంగా తొలగిపోతాయి. అయితే ఇందు కోసం 2 చెంచాల తేనెలో ఒక చెంచా నీటిని మిక్స్ చేసి కాటన్‌ సహాయంతో దురద ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. తేనె ఆరిపోయిన తర్వాత నీటితో బాగా శుభ్రం చేసుకోండి.ఇంకా అలాగే పూజకు చాలా మంది కూడా కర్పూరాన్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అయితే ఇందులో మనకు చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి దీని పొడిని ప్రభావిత ప్రాంతంలో రాస్తే దురదలు ఇంకా దద్దుర్లు చాలా ఈజీగా తగ్గుతాయి.


అలాగే కొబ్బరి నూనెలో విటమిన్లు, ఖనిజాలనేవి చాలా ఎక్కువగా లభిస్తాయి.అంతేకాకుండా ఇందులో యాంటీ ఫంగల్‌తో పాటు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి దురద, అలెర్జీలను సులభంగా తగ్గించడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి.అలాగే కొత్తిమీర ఆకులను గ్రైండ్ చేసి అందులో నిమ్మరసం కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని దురద ఉన్న భాగాలపై అప్లై చేసి సుమారు 20 నిమిషాల దాకా అలాగే ఉంచండి. ఇలా అది ఆరిపోయిన తర్వాత నీటితో శుభ్రంగా కడిగేయాలి.అలోవెరా జెల్ చర్మ సౌందర్యాన్ని పెంచడానికి ఖచ్చితంగా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలా మంది కూడా దీనిని వినియోగిస్తారు. అయితే ఇది సౌందర్యానికే కాకుండా చర్మ సమస్యలకు కూడా చాలా ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అందుకోసం అలోవెరా జెల్‌తో ఖచ్చితంగా కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్‌ను కలపండి. దీన్ని దురద ఉన్న ప్రదేశంలో అప్లై చేసి ఆరిపోయే దాకా ఉంచి శుభ్రమైన నీటితో కడిగితే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: