ఇంధన చార్జీల పెంపు విషయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పప్పులో కాలేసారని అన్నారు టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కేంద్రం రూ.2.70కే కరెంట్ ఇస్తుంటే ఏపీలో రూ.9 వసూలు చేస్తున్నారని నిర్మల అన్నారని కానీ రూ.9 కాదు రూ.9.95 వసూలు చేస్తున్నారమ్మా తల్లీ  అంటూ ఆయన పేర్కొన్నారు. 

 

ఇది బహుశా కరోనా కానుకేమో అని ఆయన ఎద్దేవా చేసారు. పెట్రో ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.30 ఉంటే... కేంద్రం ఒక రూ.25, రాష్ట్రం మరో రూ.30కి పైగా పన్ను వసూలు చేస్తున్నాయని... దీనితో రూ.85కి చేశారని ఆయన ఆరోపించారు. కరోనా కష్టకాలంలో రూ.10 పెంచడం ఎంతవరకు న్యాయమని ఆయన నిలదీశారు. గతంలో ప్రజల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని టీడీపీ ప్రభుత్వం రూ.2 వరకు పన్ను భారం తగ్గించిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: