ఎంతో పటిష్ట భద్రత ఉండే తీహార్ జైలులో ఒక ఖైదీ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. తిహార్ జైలు నెం .4 లోని 38 ఏళ్ల ఖైదీ నిన్న ఆత్మహత్య చేసుకున్నాడని తాజాగా జైలు అధికారులు ప్రకటించారు. హత్య కేసుకు సంబంధించి అతను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడని... తీహార్ జైలు అధికారులు వివరించారు. 

 

అయితే అతని ఆత్మహత్య పై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. అతను హత్య చేయలేదు అని కాని అతన్ని ఈ కేసులో ఇరికించారు అని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై తీహార్ జైలు అధికారులు అంతర్గత విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి జైళ్ళ శాఖ నివేదిక అడిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: