కరోనా బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను మిలటరీ ఆసుపత్రికి తరలించారు. ట్రంప్ ను చికిత్స కోసం సైనిక ఆసుపత్రికి తరలించినట్లు వైట్ హౌస్ శుక్రవారం ప్రకటించింది. మేరీల్యాండ్‌ లోని బెథెస్డాలోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌లో ప్రత్యేక సూట్‌కు అమెరికా అధ్యక్షుడిని తరలించినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్‌నానీ తెలిపారు.

ట్రంప్ కి కరోన లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఆయన నీరసంగా ఉన్నారని చెప్తున్నారు. నవంబర్ 3 న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే. 74 ఏళ్ల ట్రంప్ కు వయసు, బరువు కారణంగా అధిక ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు. ఆయన భార్య మెలానియా ట్రంప్ కూడా కరోనా బారిన సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: