గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాడ్మింటన్ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడానికి ప్రముఖ బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓ నిర్ణయం తీసుకున్నారు. అయితే మొయినాబాద్‌లోని సుజాత స్కూల్‌లో జ్వాల గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్సీని ఐటీ మినిస్టర్, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్.ఎమ్.ఆరిఫ్, స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్, శాట్స్ అధికారులు, జ్వాల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 55 ఎకరాల విస్తీర్ణంలో 600ల సీటింగ్ కెపాసిటీతో 14 అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కోర్ట్స్,  క్రికెట్ అకాడమీ, స్విమింగ్ పూల్, వరల్డ్ క్లాస్ జిమ్, యోగా సెంటర్లను ఏర్పాటు చేశారు. అనంతరం కేటీఆర్ తదితరులకు గుత్తా జ్వాల తమ అకాడమీలోని వివిధ విభాగాలను చూపించారు. అకాడమీలో ఏర్పాటు చేసిన జిమ్, క్రీడా ఉపకరణాల స్టాల్ ను మంత్రులు సందర్శించారు. గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ అకాడమీ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో శిక్షణ పొందుతున్న చిన్నారులతో కేటీఆర్ ముచ్చటించారు. కాగా, ఈ కార్యక్రమంలో గుత్తా జ్వాల తండ్రి క్రాంతి కూడా పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: