గత వారం అబిడ్స్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్
బాబ్జి పరిగెడుతూ అంబులెన్స్ లో దారి ఇచ్చిన ఘటనలో ఓ వృద్ధుడు ప్రాణాలతో బయటపడ్డాడు. హయత్
నగర్ కు చెందిన వ్యక్తికు
గుండె , కిడ్నీ సంబంధిత సమస్యతో మలక్ పేట్ యశోద హాస్పిటల్ కు తరలించారు ఆయన కుటుంబం సభ్యులు. అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకున్న సమయంలో ట్రాఫిక్ కానిస్టేబుల్
బాబ్జి సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో సకాలంలో హాస్పిటల్ కు చేరుకున్నారు.
దాదాపు రెండు కిలోమీటర్ల మేర కానిస్టేబుల్ పరిగెడుతూ ట్రాఫిక్ క్లియర్ చేసే సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు వృద్ధుడి కూతురు , అల్లుడు. చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్న సమయంలో కానిస్టేబుల్ బాబ్జికి కృతజ్ఞతలు చెప్పారు సదరు వృద్ధుడు. ఈ వీడియో బాగా వైరల్ అయింది. పలువురు అభినందించారు.